ప్రభాస్‌ ఫ్యాన్స్‌‌కు షాక్.. అప్పుడే ఆదిపురుష్ టైటిల్ మార్చేశారట..

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తానాజీ ఫేం, బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ డైరెక్షన్‌లో సినిమా వస్తుందనే వార్త బయటకు రాగానే అందరూ షాక్ అయ్యారు. ఓం రావత్ లాంటి సాధారణ దర్శకుడికి ప్రభాస్ ఎలా అవకాశం ఇచ్చారనే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత సినిమాపై భారీ అంచనాలతోపాటు చర్చ కూడా ఎక్కువగానే జరుగుతున్నది. అయితే అలాంటి అనుమానాలకు దర్శకుడు ఓం రావత్ సమాధానం ఇస్తూ..

కథ రాస్తున్నప్పడే ప్రభాస్‌ను మదిలో

కథ రాస్తున్నప్పడే ప్రభాస్‌ను మదిలో


ఆది పురుష్ సినిమా కథ అనుకొన్నప్పుడే ప్రభాస్ నా మదిలో మెదిలాడు. కంప్యూటర్ మీద పాత్ర తీరు తెన్నులను డిజైన్ చేస్తున్నప్పుడు ప్రభాస్‌ను ఊహించుకొనే రూపొందించాం. ఈ తరం నటుల్లో రాముడి పాత్రను చేయగల వ్యక్తి ప్రభాస్ అని బలంగా భావించాను. దేశంలోనే ప్రభాస్ గొప్ప కమర్షియల్ రేంజ్ ఉన్న నటుడు అని ఓం రావత్ అన్నారు.

రాముడిగా మారేందుకు శిక్షణ

రాముడిగా మారేందుకు శిక్షణ

ప్రభాస్‌ను ఇప్పటి వరకు యోధుడిగానే చూశాం. రాముడి అంటే గొప్ప వీలుకాడు. చేతిలో ధనుస్సును చేపట్టి శాంతరూపంలో ఉండే పాత్రలోకి మారడానికి ప్రభాస్ కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్‌ ఫిజిక్‌లో గొప్ప మార్పు చూస్తారు. త్వరలోనే విలువిద్యలో శిక్షణ తీసుకోబోతున్నారు అని ఓ రాంవత్ చెప్పారు.

అయోధి అని టైటిల్ పెట్టాలనుకొన్నాం

అయోధి అని టైటిల్ పెట్టాలనుకొన్నాం

ప్రభాస్ కెరీర్‌లో ఆది పురుష్ చిత్రం 22వది. అయితే ఈ సినిమాకు తొలుత అయోధి అనే పేరును అనుకొన్నారట. రాముడు జన్మస్థానం అయోధ్యను స్మరించుకొనేలా ఆయోధి అని పెట్టాలనుకొన్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పేరును ఆదిపురుష్‌గా మార్చాం అని ఓం రావత్ తెలిపారు.

2022లో విడుదల చేస్తాం

2022లో విడుదల చేస్తాం

ఆది పురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తాం. ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, విదేశీ భాషల్లో డబ్బింగ్ చేస్తాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ 2021లో మొదలుపెట్టి.. 2022లో విడుదల చేస్తాం అని అని ఓం రావత్ పేర్కొన్నారు.

Recommended Video

Creative Criminals Movie Opening | ప్రభాస్ నిమ్మల దర్శకత్వం లో..!!
సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా

సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా

ఆది పురుష్ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సైప్ ఆలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. కీర్తీ సురేష్ సీతగా నటించే ఈ చిత్ర షూటింగ్ జనవరి 2021లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X