Prabhas మంచి మనసు.. ఆదిపురుష్ యూనిట్ కి అద్భుతమైన గిఫ్ట్ లు.. ఏమేం ఇచ్చారంటే?
ప్యాన్ ఇండియా లెవెల్‌లో రాణిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన 'సాహో' సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఆ సినిమా కూడా కలెక్షన్స్ అలాగే మరికొన్ని అంశాల్లో పలు రికార్డులు నెలకొల్పింది. ఇక ప్రభాస్ 20వ సినిమా 'రాధే శ్యామ్' విషయంలో కూడా అనేక రికార్డులు నెలకొల్పుతుంది. అయితే ప్రభాస్ చేసిన ఒక పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎదురు చూపులతో
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. ఈ 'రాధే శ్యామ్' సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.

సినిమాలు లైన్ లో
ఈ సినిమా లైన్ లో ఉండగానే ప్రభాస్ మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో ఆది పురుష్ సినిమా ఒకటి. యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం "ఆదిపురుష్" షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ వంటి వారు తమ తమ పార్టులు షూటింగ్ పూర్తి చేశారు. నటీనటులందరితో సహా మొత్తం సినిమా చిత్రీకరణ కూడా గత నెలలో పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కోసి సెలబ్రేట్ చేసుకుంది.

పోస్ట్ ప్రొడక్షన్
ఇక "ఆదిపురుష్" చిత్రీకరణ పార్ట్‌ను పూర్తి చేయడంతో ఇప్పుడు కస్ పోస్ట్ ప్రొడక్షన్‌పై పెట్టారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సినిమా విడుదలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. కాగా "ఆదిపురుష్"లో ఎక్కువగా గ్రాఫిక్స్ కు ప్రాముఖ్యత ఉండడంతో భారీ విఎఫ్ఎక్స్ వర్క్ మీద దృష్టి పెట్టారు.

రాడో స్విస్ మేడ్ వాచీలను బహుమతిగా
అయితే ప్రభాస్ ఈ సినిమాకు పని చేసిన ముఖ్యమైన యూనిట్ సభ్యులకు ఖరీదైన రాడో స్విస్ మేడ్ వాచీలను బహుమతిగా ఇచ్చారట. వాచ్ బాక్స్‌లపై సంతకం చేసి, ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగాడని కూడా తెలుస్తోంది. ఆదిపురుష్ ఆగస్టు 11, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి, ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో మరియు రాధే శ్యామ్‌ల విషయంలో ఎలా లే అయిందో అలాగే ఈ చిత్రానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని ప్రభాస్ అభిమానులు అంచనాలలో ఉన్నారు. ఆశ్చర్యంగా 103 రోజుల్లో ఆది పురుష్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓంరౌత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Recommended Video

ఎదురుచూస్తున్న అభిమానులు
అలా షూట్ ఇంత ముందుగానే పూర్తి చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక దర్శకుడు ఓం రౌత్ ఇప్పుడు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కుతుండగా ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతాదేవిగా కనిపించనుండగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో?


Click it and Unblock the Notifications











