Radhe Shyam: ఊహించని రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్.. టాలీవుడ్‌లో మొట్టమొదటి హీరోగా ఘనత

అంతకు ముందు వరకూ టాలీవుడ్‌లో బడా హీరోగా సత్తా చాటినా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. దీంతో అప్పటి నుంచి అన్నీ బహుభాషా చిత్రాలనే చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆ మధ్య 'సాహో'తో మరో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అతడి మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ పలు భారీ చిత్రాలను చేస్తున్నాడు. అందులో 'రాధే శ్యామ్' ఒకటి. ఎన్నో అంచనాలతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ నేషనల్ రికార్డును అందుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

‘రాధే శ్యామ్’గా వస్తున్న ప్రభాస్

‘రాధే శ్యామ్’గా వస్తున్న ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

భారీ అంచనాలు.. బిజినెస్ కూడా

భారీ అంచనాలు.. బిజినెస్ కూడా


'రాధే శ్యామ్' మూవీ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో దీనికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

ట్రైలర్ రిలీజ్.. రికార్డులు బద్దలు

ట్రైలర్ రిలీజ్.. రికార్డులు బద్దలు

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీ నుంచి కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రభాస్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో తెలుగులో ఎక్కువ మంది వీక్షించిన ట్రైలర్‌గా ఇది రికార్డు సాధించింది. అంతేకాదు, ఇండియాలోనే నెంబర్ వన్‌ ప్లేస్‌కు చేరింది.

రాధే శ్యామ్‌ను వాయిదా వేసేశారు

రాధే శ్యామ్‌ను వాయిదా వేసేశారు

ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. కానీ, కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతోన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను నాలుగు రోజుల క్రితమే వదిలారు. అయితే, మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

హిందీలో ప్రభాస్ సూపర్ రికార్డు

హిందీలో ప్రభాస్ సూపర్ రికార్డు

'రాధే శ్యామ్' మూవీ రాకున్నా.. దీని ట్రైలర్ మాత్రం దూసుకుపోతూనే ఉంది. ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్.. హిందీలో భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. దీంతో ఇప్పటి వరకూ దీనికి 43 మిలియన్ వ్యూస్‌తో పాటు ఒక మిలియన్ లైకులు వచ్చాయి. తెలుగులో 34 మిలియన్ వ్యూస్‌తో పాటు 904K లైకులను మాత్రమే అందుకుంది. దీంతో అక్కడ రికార్డు కొట్టేసింది.

టాలీవుడ్‌లో మొట్టమొదటి హీరో

టాలీవుడ్‌లో మొట్టమొదటి హీరో


'రాధే శ్యామ్' ట్రైలర్‌కు హిందీలో ఒక మిలియన్ లైకులు వచ్చాయి. దీంతో ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. గతంలో అతడు నటించిన 'సాహో' సినిమా ట్రైలర్‌కు కూడా మిలియన్ లైక్స్ సొంతం అయ్యాయి. దీంతో హిందీలో రెండు మిలియన్ లైకుల ట్రైలర్‌లు అతడి సొంతం అయ్యాయి. ఇలా ఏ తెలుగు హీరో కూడా ఫీట్‌ను అందుకోకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X