ప్రభాస్ ఖాతాలో రేర్ ఫీట్.. అలాంటి రికార్డు ఆయనకే సొంతం.. ఒకే పాటతో అలా!
'బాహుబలి' సిరీస్‌తో తెలుగులో మరే హీరోకి అందనంత భారీ కలెక్షన్లు సాధించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డుల వేటలోనే ఉన్నారు. ఈ సిరీస్ తర్వాత ఆయన చేసిన 'సాహో' సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఆ సినిమా కూడా కలెక్షన్స్ అలాగే మరికొన్ని అంశాల్లో పలు రికార్డులు నెలకొల్పింది. ఇక ప్రభాస్ 20వ సినిమా 'రాధే శ్యామ్' విషయంలో కూడా ఈ సినిమా అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టిన సమయం నుండే రికార్డుల పరంపర మొదలైంది. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎదురు చూపులతో
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' సినిమా నుంచి ఫ్యాన్స్ కోరినట్లు సరైన అప్డేట్ ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. యూనిట్ కి నచ్చినట్టు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. అలా ముందుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. అప్పటికే ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తే చాలని భావించి ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ వెంటనే వైరల్ చేశారు.

అప్పటి నుంచే
అప్పట్లో ట్విట్టర్ మొత్తాన్ని 'రాధే శ్యామ్' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి రచ్చ చేయడంతో ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలా ట్విట్టర్ లో సింగిల్ హ్యాప్‌ట్యాగ్‌తో 'రాధే శ్యామ్' ఫస్ట్‌లుక్ 3.8 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించి సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్కువ ట్వీట్స్ సాధించిన ఫస్ట్‌లుక్‌గా రికార్డు సృష్టించింది.

రికార్డుల మీద రికార్డులు
అప్పట్లో ఈ విషయాన్ని కూడా సినిమా యూనిట్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ రాధే శ్యామ్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాక అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ ఎందుకో ప్రమోషన్స్ విషయంలో చాలా లెట్ చేస్తోంది. సినిమా నిర్మాణ సంస్థను పెద్ద ఎత్తున టార్గెట్ చేయడంతో ప్రమోషన్ లో స్పీడ్ పెంచింది.

రేర్ ఫీట్
మేకర్స్ ఇప్పటికే మొదటి సింగిల్‌ని విడుదల చేసారు ఇప్పుడు రెండో సాంగ్ విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా సినిమా యూనిట్ ప్రకటించిన దాని మేరకు రెండవ సాంగ్ టీజర్ రేపు విడుదల కానుంది. హిందీ వెర్షన్ మధ్యాహ్నం 1 గంటలకు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌లు రాత్రి 7 గంటలకు విడుదల కానున్నాయి.
Recommended Video

పిరియాడికల్ లవ్ స్టోరీ
ఒక స్టార్ ఒకే రోజు వివిధ సంగీత దర్శకులతో కలిసి వివిధ భాషల పాటను విడుదల చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఈ సినిమా సౌత్ వెర్షన్‌లకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించగా, హిందీ వెర్షన్ సంగీతం మిథున్ - అమాల్ మల్లిక్ - మనన్ భరద్వాజ్ అందించారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. ఈ 'రాధే శ్యామ్' సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











