బ్రహ్మండంగా బాహుబలి.. 7 లక్షల సైన్యంతో హల్‌చల్

Recommended Video

Young Rebel Star Prabhas Into Instagram || Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి సోషల్ మీడియాలో రుజువైంది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్స్‌టాగ్రామ్‌లోకి రికార్డుల పరంపరతో అడుగుపెట్టాడు. అకౌంట్ ప్రారంభించి ఒక్క పోస్టు చేయకుండానే ప్రభాస్‌కు ఫాలోవర్స్ వెల్లువెత్తారు. ఇది దక్షిణాది సినిమాకు సంబంధించిన ఓ హీరోకు దక్కిన అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. బాహుబలి రేంజ్‌లో ఇన్స్‌టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన డార్లింగ్‌కు అభిమానులు నీరాజనం పడుతుండటం ఓ విశేషంగా పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇన్స్‌టాగ్రామ్‌లోకి యంగ్ రెబల్ స్టార్

ఇన్స్‌టాగ్రామ్‌లోకి యంగ్ రెబల్ స్టార్

ఇన్స్‌టాగ్రామ్‌లో యాక్టర్ ప్రభాస్ (www.instagram.com/actorprabhas) పేరుతో తన ఖాతాను ప్రారంభించారు. అకౌంట్ ఓపెన్ కాగానే దాదాపు 7 లక్షల మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఇది ప్రభాస్ కెరీర్‌లో చెప్పుకోదగిన ఘనతల్లో ఒకటి. దక్షిణాది ఇండస్ట్రీలో ఏ హీరోకు దగ్గని ఘనత ప్రభాస్‌కే దక్కిందని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. 24 గంటల్లో రికార్డు స్థాయి ఫాలోవర్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో 10 మిలియన్ల ఫాలోవర్స్

ఫేస్‌బుక్‌లో 10 మిలియన్ల ఫాలోవర్స్

ప్రభాస్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. అయితే ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లోకి ప్రవేశించలేదు. ఇన్సాటాగ్రామ్ తర్వాత ప్రభాస్ త్వరలోనే ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సు ఉంది.

ఫస్ట్ పోస్ట్ ఏంటనే విషయంపై ఆసక్తి

ఫస్ట్ పోస్ట్ ఏంటనే విషయంపై ఆసక్తి

ప్రభాస్ తన ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో ఫస్ట్ పోస్టు ఏది పెడుతారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొన్నది. తప్పకుండా ప్రభాస్ తన తాజా చిత్రం సాహో సినిమాకు సంబంధించిన ఫోటోను పెడుతారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెట్టబోయే తొలి పోస్టు కోసం సినీ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరుగుతుండటం సహజమేగా.

ఆగస్టు 15న సాహోగా ప్రభాస్

ఆగస్టు 15న సాహోగా ప్రభాస్

ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే, బాహుబలి తర్వాత సాహో చిత్రంలో నటిస్తున్నారు. రూ.300 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్నది. ఇప్పటికే విడుదలైన సాహో టీజర్లు రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించాయి. రన్ రాజా రన్ ఫేం డైరెక్టర్ సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X