అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ‘సాహో’.. దక్షిణాదిలోనే ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.

 ట్రైలర్‌తో రెట్టింపు

ట్రైలర్‌తో రెట్టింపు

కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు, ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో అవి రెట్టింపయ్యాయి. ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.

ప్రమోషన్ షురూ

ప్రమోషన్ షురూ

త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే ప్రభాస్ - శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించబోతున్నారు.

సాహో ఘనత

సాహో ఘనత

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. ‘సాహో' సినిమాను ప్రపంచంలోనే పెద్దదైన గ్రాండ్‌ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇది పారిస్‌లో ఉంది. ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది కూర్చుని సినిమా చూసే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ తమ సినిమా ప్రదర్శితమవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

 ప్రభాస్ రికార్డు

ప్రభాస్ రికార్డు

ఇక్కడ ప్రభాస్ సినిమా విడుదల అవడం కొత్తేమీ కాదు. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'ని కూడా ఇక్క ప్రదర్శించారు. అయితే, మరే తెలుగు హీరో సినిమా ఇక్కడ ప్రదర్శితం కాలేదు. అలాగే, దక్షిణాది నుంచి ఇప్పటి వరకు ‘కబాలి', ‘మెర్సల్‌', ‘విశ్వరూపం 2' మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకున్నాయి. అంటే.. ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X