Prabbas సలార్ రిలీజ్ డేట్ కోసం న్యూ ప్లాన్.. మరింత ఆలస్యంగా రాబోతున్న యాక్షన్ మూవీ!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం మళ్లీ అదే తరహాలో సక్సెస్ ను కొనసాగించాలని ఎంతగానో హార్డ్ వర్క్ చేశాడు యు.వి.క్రియేషన్స్ లో వచ్చిన సాహో సినిమా అలాగే ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయగా ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. కమర్షియల్గా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ప్రభాస్ రాబోయే సినిమాలతో మరింత గ్రాండ్గా సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు.

Recommended Video

Salaar తో Prabhas గ్రాండ్ కమ్ బ్యాక్.. ఫ్యాన్స్ నమ్మకం Prashant Neel పైనే | Filmibeat telugu

ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు అయితే ఎక్కువగా సలార్ సినిమా పైనే హోప్స్ పెట్టుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్న కూడా కొడితే అదే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడు అనే నమ్మకంతో ఉన్నారు. ముందుగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా సీత పాత్రలో కృతి సనోన్ కనిపించనుంది. ఈ సినిమాను రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

prabhas salaar movie first part new release date planning

అయితే ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఇంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది అతి పెద్ద సందేహం. అంతేకాకుండా ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో చేయబోయే హారర్ కామెడీ సినిమా ప్రభాస్ రేంజ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అనేది మరొక సందేహం. ఇక ప్రాజెక్టు K, స్పిరిట్ రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రభాస్ రేంజ్ తగ్గట్టు అభిమానులకు నచ్చే విధంగా ఉండాలి అంటే అది సలార్ సినిమాతోనే సాధ్యం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమాతోనే ప్రభాస్ మళ్ళీ పూర్తి స్థాయిలో మెప్పించగలడు అని నమ్ముతున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

అయితే మొదటి భాగాన్ని ఇదే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో దర్శకుడు సినిమాని 2023లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో లేదా మార్చి నెలలో విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది. ఇప్పటికే సగానికి చేరుకున్న సినిమా షూటింగ్ మరొక సగానికి పైగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతోంది. ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. మరి వచ్చే ఏడాది సమ్మర్ లో రాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. అలాగే ప్రబాస్ సలార్ సెకండ్ పార్ట్ ను అదే ఏడాది చివరలో లేదా 2024 మొదట్లో విడుదల చేయవచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X