Salaar Teaser ఆలస్యానికి కారణమిదే.. ఎప్పుడు రాబోతోందంటే?

రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సలార్ మూవీ అనుకున్న సమయం కంటే కూడా ఇంకా చాలా ఆలస్యంగా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని దర్శకుడు ప్రశాంత్ చాలానే కష్టపడ్డాడు. కానీ అనుకోకుండా KGF 2 సినిమా వాయిదా పడడంతో ఈ సినిమా షూటింగ్ కూడా మధ్యలో బ్రేక్ లు పడ్డాయి. పైగా కరోనా కారణంగా సినిమా రిలీజ్ డేట్స్ కూడా క్లాష్ రావడంతో సినిమాను ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సి వచ్చింది.

అయితే కనీసం టీజర్ అయినా అనుకున్న సమయానికి విడుదల చేస్తారు అనుకుంటే అది కూడా జరగలేదు. అసలైతే సలార్ టీజర్ ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అందుకు సంబంధించిన కొంత వర్క్ కూడా ప్రశాంత్ నీల్ పూర్తి చేసాడు. కానీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తికాకపోవడంతో ఇప్పుడే టీజర్ విడుదల చేస్తే బాగుండదు అని మళ్ళీ రిలీజ్ డేట్ కు పెద్ద గ్యాప్ వస్తుంది అని ఆలోచించారట.

prabhas salaar movie latest teaser update and release date

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే టీజర్ ను జూలై రెండవ వారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. దర్శకుడు ప్రశాంత్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీజర్ ను వాయిదా వేయకూడదు అని అన్ని భాషల్లో కూడా భారీ స్థాయిలో హైలెట్ అయ్యే విధంగా చేయాలి అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఒక బలమైన నమ్మకం ఏర్పడింది.

ఎందుకంటే ఇదివరకు ప్రభాస్ తీసిన సాహో, రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. కాబట్టి ఫ్యాన్స్ హోప్స్ ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాకంటే ముందే ఆదిపురుష్ విడుదల అవుతున్నప్పటికీ కూడా సలార్ సినిమాపైనే అంచనాలు ఎక్కివగా ఉన్నాయి. మాస్ హీరో ప్రభాస్ కు ఇదే సరైన సినిమా అని ఓ వర్గం అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X