Prabhas ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్: మళ్లీ ఆ సమస్య రాకుండా ప్లాన్

రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనలోని టాలెంట్లను నిరూపించుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా సక్సెస్‌ను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి తన రేంజ్‌నే దేశ వ్యాప్తంగా పెంచుకుని భారీ చిత్రాలనే చేస్తున్నాడు.

ఇలా ఇప్పుడు ఏకంగా మూడు నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇటీవలే కన్నుమూశారు. దీనిపై నిరాశగా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. అసలేం జరిగిందో మీరే చూడండి!

రాధే శ్యామ్‌తో బిగ్గెస్ట్ డిజాస్టర్

రాధే శ్యామ్‌తో బిగ్గెస్ట్ డిజాస్టర్

ప్రభాస్ ఇటీవలే ‘రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుకున్న రీతిలో స్పందన లభించలేదు. ఫలితంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఫుల్ రన్‌లో కేవలం రూ. 83 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తద్వారా నిర్మాతలకు ఏకంగా రూ. 120 కోట్ల నష్టాలతో బిగ్గెస్ట్ ఫ్లాప్‌ అయింది.

సలార్‌గా రాబోతున్న ప్రభాస్

సలార్‌గా రాబోతున్న ప్రభాస్

ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

ఎప్పుడో మొదలు.. ఆలస్యం

ఎప్పుడో మొదలు.. ఆలస్యం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘సలార్' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. ఇప్పటి వరకూ ఇది రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. అలా కేవలం 40 శాతం మాత్రమే టాకీ పార్ట్ పూర్తైంది. ఇక, పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అవుతోంది.

కొత్త డేట్‌ను అనౌన్స్ చేశారు

కొత్త డేట్‌ను అనౌన్స్ చేశారు

వాస్తవానికి ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘సలార్' మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అప్పట్లో ప్రకటించింది. అయితే, షూటింగ్ ఆలస్యం అవడంతో అప్పుడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2028 సెప్టెబర్ 28న విడుదల చేస్తున్నట్లు సలార్ మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.

షూటింగ్ స్పీడ్... ఈ నెలలో

షూటింగ్ స్పీడ్... ఈ నెలలో

‘సలార్' మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను సమ్మర్‌లోనే మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. అప్పటి నుంచి స్పీడుగా షూట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో చిత్రీకరణ పున: ప్రారంభం కాలేదు. దీంతో సెప్టెంబర్‌లో దీన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని భారీ సెట్‌లను కూడా నిర్మించుకున్నారు.

ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్

ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్లో గత ఆదివారం పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అతడి పెదనాన్న దిగ్గజ నటుడు కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో యంగ్ రెబెల్ స్టార్‌తో పాటు అతడి అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ‘సలార్' మూవీ షూటింగ్ నెల రోజుల పాటు వాయిదా పడుతుందని ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.

రెండు నెలలైనా గ్యాప్ ఇచ్చి

రెండు నెలలైనా గ్యాప్ ఇచ్చి

‘సలార్' మూవీ షూటింగ్‌లో ప్రభాస్ ఈ నెల నుంచే పాల్గొనేలా షెడ్యూల్ చేసుకున్నాడు. కానీ, కృష్ణంరాజు మరణం తర్వాత అతడు నెల రోజులైనా గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంటే ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నెల నుంచి పున: ప్రారంభం కాబోతుందని తెలిసింది. అయితే, ఈ ప్రభావం రిలీజ్ డేట్‌పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X