twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas: ఇండియాలోనే ఇది ఫస్ట్ టైమ్.. ఫ్యాన్స్ కు ప్రభాస్ గుడ్ న్యూస్

    |

    దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ మూవీతో తెరంగేట్రం చేసిన డార్లింగ్.. బాహుబలి మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటినుంచి చేసే ప్రతి మూవీని పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ అలరిస్తున్నాడు ఈ మిస్టర్ పర్ ఫెక్ట్. అయితే బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ అంతగా సక్సెస్ తేలేకపోయాయి. డార్లింగ్ తో సహా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆదిపురుష్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా గురించి ఒక్క అప్ డేట్ వచ్చినా చాలు అని ఎంతో ఎదురుచూశారు. అంతలా ఎదురుచూసిన వారికి ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్ ఎంతగానో నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ పై వచ్చిన ట్రోలింగ్ పై తాజాగా గురువారం రియాక్ట్ అయ్యాడు ప్రభాస్.

    సరయు నది ఒడ్డున..

    సరయు నది ఒడ్డున..


    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 2న విడుదల చేస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించినట్లుగానే అదే రోజున ఉత్తరప్రదేశ్ లోని సరయు నది ఒడ్డున రిలీజ్ చేసింది. ఒక నిమిషం 46 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు, డార్లింగ్ ఫ్యాన్స్ తోపాటు రాజకీయ వేత్తలు అసహనం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్లయితే మీమ్స్ తో రెచ్చిపోయారు. సినిమాకు రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. నిజంగా అంత ఖర్చు చేశారా.. ఎదో చిన్న పిల్లలు చూసేవిధంగా బొమ్మల సినిమాల ఉంది.. ఆ విజువల్స్ కూడా అంత క్వాలిటీగా లేవని రకరకాల విమర్శలు వచ్చాయి.

    ఆదుపురుష్ ను బ్యాన్ చేయాలని డిమాండ్

    ఆదుపురుష్ ను బ్యాన్ చేయాలని డిమాండ్


    అంతేకాకుండా ఈ టీజర్ చూసిన అనేకమంది రాజకీయ ప్రముఖుల సైతం విమర్శలు గుప్పించారు. ఇక అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఏకంగా ఆదిపురుష్ మూవీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ మీమ్స్, ట్రోలింగ్ పై ఇటీవలే డైరెక్టర్ ఓం రావత్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను యూట్యూబ్ కోసం బిగ్ స్క్రీన్ లో ప్రేక్షకులు అనుభూతి చెందేందుకు తెరకెక్కించామని స్పష్టం చేశారు. ఇక తాజాగా ఆదిపురుష్ టీజర్ నెగెటివిటీపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించాడు. అక్టోబర్ 6 గురువారం ఆదుపురుష్ త్రీడీ టీజర్ ను హైదరాబాద్ లోని AMB మాల్ లో మీడియాకు ప్రదర్శించారు.

    అభిమానులకు ప్రభాస్ గుడ్ న్యూస్..

    అభిమానులకు ప్రభాస్ గుడ్ న్యూస్..

    ఈ టీజర్ చూసిన మీడియా ప్రతినిధులు చప్పట్లు కొట్టి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తోపాటు డైరెక్టర్ ఓం రావత్, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, ప్రమోద్, వంశీ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో తన అభిమానులకు ప్రభాస్ గుడ్ న్యూస్ తెలిపాడు. ఇవాళ అంటే అక్టోబర్ 7న 60 థియేటర్లలో ఈ త్రీడి టీజర్ ను తన ఫ్యాన్స్ కోసం ప్రదర్శించనున్నట్లు తెలిపాడు. అలాగే ''ఈ టీజర్ ను నేను ఫస్ట్ టైమ్ త్రీడీలో చూసినప్పుడు చిన్నపిల్లాడిని అయిపోయాను. నాకు గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అనిపించింది. విజువల్స్, యానిమల్స్ మొహం పైకి రావడం నాకు చాలా థ్రిల్లింగ్ కా అనిపించింది.

     60 థియేటర్లలో ఆదిపురుష్ త్రీడీ టీజర్..

    60 థియేటర్లలో ఆదిపురుష్ త్రీడీ టీజర్..

    రేపు ఫ్యాన్స్ కోసం 60 థియేటర్లలో ఈ త్రీడీ టీజర్ ను విడుదల చేస్తున్నాం. ఎందుకంటే వాళ్లే కదా మాకు సపోర్ట్. వాళ్లు ఫస్ట్ చూడాలి. వాళ్లు ఎలా ఫీలవుతారన్నది తెలుసుకోవాలి. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాం. ఇండియాలో ఇలాంటి టెక్నాలజీ ఇప్పటివరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైమ్. ఇది బిగ్ స్క్రీన్ కోసం చేసిన మూవీ. ముఖ్యంగా త్రీడీలో చూడాలి. కాబట్టి అందరూ థియేటర్ లోనే చూడండి. త్వరలోనే ఇంకో బ్యాంగ్ ఆన్ కంటెంట్తో మళ్లీ వస్తాం'' అని ప్రభాస్ పేర్కొన్నాడు. అయితే ఆదిపురుష్ చిత్రాన్ని మోషన్ క్యాప్చర్ సహాయంతో ''కట్టింగ్ ఎడ్జ్'' అనే టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించారట.

    ఈ సాంకేతికతను ఎక్కువగా హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ఉపయోగిస్తారట. టీ-సిరీస్ సంస్థ మొదటిసారిగా ఈ సాంకేతికతను ఇండియాకు తీసుకువచ్చింది. ఆదిపురుష్ మూవీ బిగ్ స్క్రీన్ పై మంచి అనుభూతి ఇస్తుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా చెబుతోంది. మరి చూడాలి రేపు విడుదలయ్యాక ప్రేక్షకులు ఎలాంటి అనుభూతికి లోనవుతారనేది.

    English summary
    Pan India Star Prabhas Says Adipurush Technology Is First Time In India At Adipurush 3D Teaser Release Event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X