Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆవిడే: ప్రభాస్ నోట తొలిసారి ఆ మాట...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... అసలే చాలా సిగ్గరి! ఈ విషయం ఆయనే పలు సందర్భాల్లో స్వయంగా ఒప్పుకున్నారు. ఇక అమ్మాయిలన్నా, వారితో మాట్లాడాలన్నా మన హీరోకు చాలా మొహమాటం. తనతో కలిసి పని చేసిన హీరోయిన్లలో ప్రభాస్ సన్నిహితంగా మెలిగింది ఒకే ఒక్కరితో... ఆవిడే బాహుబలి స్టార్ అనుష్క. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లు కలిసి పనిచేయడం, అంతకు ముందు మిర్చి సినిమాకు వర్క్ చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. అయితే చాలా మంది వీరి సన్నిహితమైన స్నేహాబంధాన్ని ప్రేమ అనుకున్నారు. ఈ విషయం పలు సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చినపుడు అలాందేమీ లేదని, తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని ప్రభాస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆవిడే: ప్రభాస్ నోట తొలిసారి ఆ మాట...
ప్రభాస్ నోట తొసారిగా గర్ల్ ఫ్రెండ్ అనే మాట వచ్చింది. ‘సాహో' ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ ‘నచ్ బలియే 9' అనే హిందీ డాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోలో జడ్జిగా ఉన్న రవీనా టండన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నా ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ వ్యాఖ్యానించారు.
ప్రభాస్‌కు ఆమె అంటే చిన్నతనం నంచి క్రష్
రవీనా టండన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులో ఆమెను సినిమాల్లో చూసినపుడు క్రష్ ఉండేదని, అందుకే ఆమెను తన ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించినట్లు ప్రభాస్ తెలిపారు. అంతే కాదు ఈ డాన్స్ రియాలిటీ షోలో ఓ పాటకు రవీనా టండన్‌తో కలిసి స్పెప్స్ కూడా వేశారు యంగ్ రెబల్ స్టార్.
సాహో మూవీకి, రవీనా టండన్ భర్తకు లింక్
ఇటీవల రామోజీఫిల్మ్ సిటీలో జరిగిన ‘సాహో' ప్రీ రిలీజ్ ఈవెంటులో అనిల్ థడాని గురించి ప్రభాస్ ప్రత్యేకంగా చెప్పారు. ఆయన ఎవరో కాదు ‘సాహో' సినిమా బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్. ‘సాహో' షూటింగ్ మొదలైన మొదటి రోజు నుంచి అనిల్ థడాని చిత్ర బృందానికి చాలా హెల్ప్ చేశారట. అనిల్ థడాని... రవీనా టండన్ భర్త కూడా. 2004లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం.
సాహో
సాహో మూవీ విషయానికొస్తే.... ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ వారు రూపొందించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.