ఎవరిని వదిలినా ప్రభాస్ అతన్ని మాత్రం వదలడు.. ప్రాణ స్నేహితుడితో లేటెస్ట్ ఫొటో వైరల్
రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లోకల్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో అతని నుంచి మరిన్ని పెద్ద సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఒక ఫ్రెండ్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సక్సెస్ స్థాయి ఎంత పెరిగినా
రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ఈశ్వర్ సినిమాతో మొదలైన విషయం తెలిసిందే. మొదటి విజయం రావడానికి సమయం చాలానే పట్టింది. ఇక వర్షం ఛత్రపతి సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న డార్లింగ్ అనంతరం బాహుబలి సినిమాతో అంతకుమించి అనేలా నేషనల్ వైడ్ క్రేజ్ అందుకున్నడు. సక్సెస్ స్థాయి ఎంత పెరిగినా కూడా అతని మనసు మాత్రం మారలేదు.

స్నేహితులతో అదే బాండింగ్
ప్రభాస్ ఈశ్వర్ సినిమా నుంచి ఇప్పటికి అలానే ఉన్నాడని అతనితో వర్క్ చేసిన వాళ్ళు చెబుతుంటారు. అయితే సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందులో యూవీ నిర్మాతలు అలాగే హీరో గోపిచంద్ ఒకరు. వారితో కూడా ఆ బాండింగ్ అలానే కొనసాగుతోంది.

ప్రభాస్ శ్రీనుతో..
ఇక అందరికి తెలిసిన మరొక ప్రాణ స్నేహితుడు కూడా ఉన్నాడు. అతనే ప్రభాస్ శ్రీను. అప్పట్లో ప్రభాస్ నటించిన ప్రతి సినిమాలో శ్రీను నటిస్తూ వస్తున్నాడు. ఇద్దరు కూడా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటునప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్. అయితే ప్రభాస్ అతడిని కేవలం నటుడిగానే కాకుండా డేట్స్ చూసుకునే ఫ్రెండ్ గా కూడా నియమించుకున్నాడు.

సెల్ఫీ వైరల్..
ప్రస్తుతం ప్రభాస్ బిజీ షెడ్యూల్ మొత్తం కూడా శ్రీను చూసుకుంటున్నాడు. అందుకే అతను అవకాశాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలను దూరం పెట్టాల్సి వస్తోంది. ఇక ఇటీవల శ్రీను ప్రభాస్ తో ఒక సెల్ఫీ దిగాడు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ ఆది పురుష్ కు సంబంధించిన ఒక అప్డేట్ బుధవారం రాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











