Prabhas ఉత్తుత్తిగా ప్రభాస్‌ను డార్లింగ్ అంటారా? దీపిక పదుకోన్‌ కోసం యంగ్ రెబల్ స్టార్ ఏం చేశారో తెలిస్తే.. !

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ హైదరాబాద్‌లో తీవ్ర అస్వస్థతకు గురికావడం అటు Project K యూనిట్‌ను, ఇటు అభిమానులను కంగారుపెట్టింది. అయితే అనారోగ్యానికి గురికావడంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరిగిన వెంటనే ఆమె అనారోగ్యం నుంచి తీరుకొని మళ్లీ షూటింగులో పాల్గొన్నది. తన తోటి హీరోయిన్ అనారోగ్యానికి గురి అయిందనే విషయం తెలుసుకొన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీసుకొన్న చొరవ అందర్ని ఆకట్టుకొంటున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్‌ను డార్లింగ్ అని..

ప్రభాస్‌ను డార్లింగ్ అని..


సినీ పరిశ్రమలో ప్రభాస్‌ను అందరూ డార్లింగ్ అని పిలుస్తారనే అందరికి తెలిసిందే. డార్లింగ్ అనే పేరు కేవలం ఆయన ఇతరులు, తన స్నేహితులు, సన్నిహితులు, షూటింగులో తోటి నటీనటుల గురించి తీసుకొనే చొరవ, చూపించే ప్రేమను బట్టి అతడికి ఆ పేరు వచ్చింది. సున్నితమైన మనసుతో ఇతరుల గురించి తాను తీసుకొన్న చొరవ మరోసారి మీడియాలో చర్చనీయాంశమైంది.

దీపిక పదుకోన్ అనారోగ్యానికి గురి కావడంతో

దీపిక పదుకోన్ అనారోగ్యానికి గురి కావడంతో


దీపిక పదుకోన్ సెట్లో కళ్లు తిరిగిపడిపోయే సరికి యూనిట్ సభ్యులంతా కంగారు పడ్డారు. ఆమె అలా ఊహించని విధంగా పడటంతో వెంటనే ప్రభాస్ హాస్పిటల్‌కు తరలించే పనిని తీసుకొన్నారట. ఆమెను హాస్పిటల్‌కు పంపించి.. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన టీమ్ సభ్యులను పురమాయించి.. దీపిక బాగోగులు చూసుకోవాలని ప్రభాస్ చెప్పారనే విషయం ప్రాజెక్ట్ K యూనిట్ సభ్యులు వెల్లడించారు.

 ఆందోళనలో ప్రభాస్, చిత్ర యూనిట్

ఆందోళనలో ప్రభాస్, చిత్ర యూనిట్


దీపిక పదుకోన్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో ప్రభాస్ ఆందోళనకు లోనయ్యాడు. వెంటనే నిర్మాత, దర్శకులతో మాట్లాడి.. దీపికతో ఉన్న సీన్ల షూటింగ్ వాయిదా వేద్దామని అడిగాడు. తర్వాత రీషెడ్యూల్ చేసుకొందామని చెప్పాడు. ఓ వారంపాటు దీపిక ఉన్న సీన్లను వాయిదా వేద్దాం అని దర్శకుడు నాగ్ అశ్విన్‌కు చెప్పినట్టు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

హాస్పిటల్ నుంచి షూట్‌కు దీపిక

హాస్పిటల్ నుంచి షూట్‌కు దీపిక


అయితే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకొన్న తర్వాత వెంటనే దీపిక పదుకోన్ షూటింగ్‌కు హాజరయ్యారు. తనపై చిత్రీకరించాల్సిన సీన్లలో దీపిక పాల్గొన్నారు. ప్రభాస్, దీపికపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తన తోటి ఆర్టిస్టు గురించి ప్రభాస్ పడిన తపన, చొరవ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అందుకే డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకొంటారనే విషయాన్ని పేర్కొంటున్నారు. అలాగే దీపిక పదుకోన్.. అనారోగ్యం పేరు చెప్పి రెస్ట్ తీసుకొకుండా వెంటనే షూటింగ్‌లో పాల్గొనడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రభాస్ సినిమా కెరీర్ ఇలా..

ప్రభాస్ సినిమా కెరీర్ ఇలా..


ఇదిలా ఉండగా.. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఆయన ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్K చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలోనే ఆదిపురుష్ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

 దీపిక పదుకోన్ చేస్తున్న ప్రాజెక్టులు

దీపిక పదుకోన్ చేస్తున్న ప్రాజెక్టులు


ఇక దీపిక పదుకోన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించి ప్రాజెక్ట్K షూటింగులో బిజీగా ఉన్నారు. అలాగే షారుక్ ఖాన్‌తో పఠాన్, హృతిక్ రోషన్‌తో ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X