For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా రోజుల తరువాత సాహో సినిమాపై స్పందించిన ప్రభాస్.. థ్యాంక్స్ చెబుతూ..

    |

    టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా అనేటట్టుగా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. బాహుబలి తరువాత డార్లింగ్ క్రేజ్ ఏ స్థాయికి పెరిగిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా హీరో అంటే మొదట ఏ ఇండస్ట్రీకైనా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు ప్రభాస్. ఇక సాహో సినిమాతో అదే రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని ప్రభాస్ చేసిన ప్రయత్నానికి ఒక విధంగా భారీ క్రేజ్ అయితే వచ్చింది.

    కానీ సినిమా బాలీవుడ్ లో తప్పితే మరెక్కడా కూడా ఎక్కువగా లాభాలను అందించలేదు. నిర్మాతలు ప్రీ రిలీజ్ బిజినెస్ వద్ద నష్టాలు రాకుండా సేఫ్ అయ్యారు గాని డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం చాలానే నష్టపోయారు. ఇక అసలు విషయానికి వస్తే.. నేటితో ఈ సినిమా విడుదలై ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమాకు సంబంధించిన స్పెషల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

    Prabhas special post on one year of saaho thanks to fans

    ఇక ప్రభాస్ కూడా 1 ఇయర్ ఆఫ్ సాహో అంటూ ఒక స్పెషల్ పోస్టర్ పోస్ట్ చేశాడు. తనకు సపోర్ట్ చేసిన ప్రియమైన అభిమానులకు అలాగే సాహో టీమ్ కి పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నట్లు ప్రభాస్ వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ పాన్ ఇండియన్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    The much awaited Prabhas 20th movie First Look has finally been released. UV Creations, which has been making fans a little impatient for years due to delays, got a good kick out of the whole first look. The title of Radheshyam has been fixed for the movie as everyone expected. The First Look title is currently trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X