టెన్షన్ తీర్చేసిన ప్రభాస్... అలా కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీ... కానీ ?
గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉన్న టెన్షన్ తీరిపోయింది, కొద్ది రోజుల క్రితం ప్రభాస్ మేకప్ ఆర్టిస్ట్ కి కరోనా సోకడంతో ప్రభాస్ ఐసోలేషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మేకప్ ఆర్టిస్ట్ కరోనా బారిన పడిన కారణంగా ప్రభాస్ తో పాటు 'రాధే శ్యామ్' టీం మొత్తం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు ప్రచారం జరిగింది. అలానే 'రాధే శ్యామ్' షూటింగ్ షెడ్యూల్ కూడా నిలిపివేశారని, కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీంతో ఆయన అభిమానులు ఎక్కడలేని టెన్షన్ నెలకొంది. తమ అభిమాన హీరోకి ఏమయిందో ?మేకప్ మేకప్ ఆర్టిస్ట్ తో సన్నిహితంగా మెలిగే ప్రభాస్ కు ఏమవుతుందో అని టెన్షన్ వారిలో నెలకొంది. ప్రభాస్ అటెన్షన్ అంతా తీర్చేశాడు. అసలు విషయంలోకి వెళితే

రాధే శ్యామ్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్ కి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా... పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది జూలై 30న 'రాధే శ్యామ్' విడుదల కానుందని ఇంతకు ముందు మేకర్స్ ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నిర్మాతలు తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నారు. ఇక 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. కానీ 'రాధే శ్యామ్' సినిమా విడుదల వాయిదా గురించి మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

లైన్ లో మూడు సినిమాలు
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలు కాకుండా ఆయన మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కబోతోంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. కృతిసనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.

ఫ్యాన్స్ హ్యాపీ
బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్ క్రేజ్ సంపాదించిన ప్రభాస్ ఇప్పుడు బయట పెడితే అది వార్త అయిపోతుంది. తాజాగా ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. కాస్త బక్కచిక్కిన ప్రభాస్ కొత్త లుక్ లో క్యాజువల్ డ్రెస్ లో దర్శనమిచ్చారు. ఓవర్ సైజ్ అయిన టీ షర్ట్ వేసుకుని కామో ఫ్యాంట్ వేసుకుని నల్ల్లటి స్నీకర్స్ తో కనిపించాడు. తలను గుడ్డతో కవర్ చేసి ముఖానికి మాస్కు ధరించి కళ్లద్దాలు పెట్టుకుని ఆయన కెమెరా కంటికి చిక్కారు. దీంతో ప్రభాస్ కి ఏమీ కాలేదని ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
Recommended Video
హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళుతున్నాడు
అయితే ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడికో వెళుతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆది పురుష్ షూటింగ్ కోసం ముంబై వెళుతున్నాడా ? అంటే ప్రస్తుతానికి ముంబైలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఆయన ముంబై వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.. ఇప్పటికే ముంబైలో ఉన్న పలు ప్రొడక్షన్ కంపెనీలు తమ షూటింగ్ లను భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ప్లాన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. బహుశా ప్రభాస్ కూడా ఏదైనా షూటింగ్ కోసమే వెళ్లాడా అనే చర్చ కూడా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











