Salaar: బుక్ మై షోలో ప్రభాస్ సంచలనం.. ఇండియాలోనే ఏకైక హీరోగా రికార్డు
'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించాడు. అలాగే, ఇప్పుడు ఏకకాలంలో వరుసగా బోలెడన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని ఫుల్ జోష్‌తో దూసుకెళ్తున్నాడు.
ప్రభాస్ నటించిన చిత్రాల్లో 'సలార్' ఒకటి. కేజీఎఫ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న నేపథ్యంలో ఫస్ట్ పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' పేరుతో విడుదల చేయబోతున్నారు.

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేస్తున్నారు. దీంతో ఓవర్సీస్‌లో ఎప్పుడో బుకింగ్ ఓపెన్ అయ్యాయి. అలాగే, ఇండియాలోని చాలా ఏరియాల్లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే చాలా టికెట్లు సేల్ అయ్యాయి.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ వివరాలను ప్రముఖ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్ మై షో చాలా రోజుల క్రితమే అందులో పొందుపరిచింది. దీంతో ఈ సినిమాపై ఎంతో మంది ఆసక్తిని తెలుపుతున్నారు. ఇలా తాజాగా ఈ మూవీ బుక్‌మైషోలో 1 మిలియన్ అంటే పది లక్షల మంది ఆసక్తిని పొందింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది.

భారీ బడ్జెట్ చిత్రాలు బుక్ మై షోలో ఒక మిలియన్ లైకులు సాధించడం ఇప్పుడు సాధారణమైన విషయం అయిపోయింది. అయితే, 'సలార్' ఇప్పుడు ఈ ఫీట్‌ను సాధించడంతో ప్రభాస్ ఖాతాలో గొప్ప రికార్డు వచ్చి చేరింది. అతడు నటించిన 'ఆదిపురుష్' మూవీ కూడా ఈ ఫీట్ సాధించింది. దీంతో వరుసగా రెండు సినిమాలతో 1 మిలియన్ కొట్టిన హీరోగా ప్రభాస్ నిలిచాడు.
ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











