Salaar: ప్రభాస్ పెను సంచలనం.. ఒక్కరోజే అన్ని కోట్లా.. ఇండియాలోనే నెంబర్ వన్ రికార్డు ఔట్

కృష్ణం రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. కొంత కాలంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ జోష్‌లోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు 'సలార్' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అవగా.. ఇది నేషనల్ రేంజ్‌లో టాప్ వ్యూస్ సాధించింది. ఆ వివరాలు మీకోసం!

'సలార్'గా వస్తున్న ప్రభాస్: యంగ్ రెబెల్ స్టార్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ మూవీనే 'సలార్'. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా విడుదల కాబోతుంది.

 Prabhas

రిలీజ్ అప్పుడే.. టీజర్‌తోనే: ప్రభాస్ - ప్రశాంత్ నీల్ పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీని సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే షూట్ కంప్లీట్ చేశారు. ఇక, రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే జూలై 6వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.

టీజర్‌కు భారీ రెస్పాన్స్‌తో: 'సలార్' మూవీ టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీన్ని ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సామాన్య సినీ ప్రియులు కూడా ఆదరించారు. దీంతో ఈ వీడియోకు భారీగా వ్యూస్, లైకులు వచ్చాయి. ఇక, ఈ టీజర్‌ 24 గంటల్లోనే ఏకంగా 83 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అలాగే, ఈ వీడియో 1.67 మిలియన్ లైకులను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.

 Prabhas

ఇండియాలో నెంబర్ వన్: 24 గంటల్లోనే ఏకంగా 83 మిలియన్ వ్యూస్‌ను అందుకున్న 'సలార్' టీజర్ ఎన్నో అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియాలో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ల జాబితాలో ఇది టాప్ ప్లేస్‌కు చేరింది. ఈ క్రమంలోనే 'ఆదిపురుష్' పేరిట ఉన్న 68.96 మిలియన్ల రికార్డును దాటింది. ఈ లిస్టులో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 68.83 మిలియన్ వ్యూస్‌తో 3వ ప్లేస్‌లో ఉంది.

అందులో మూడో స్థానమే: ప్రభాస్ నటించిన 'సలార్' టీజర్‌కు 24 గంటల్లోనే భారీ స్థాయిలో వ్యూస్ వచ్చినప్పటికీ.. లైకుల పరంగా మాత్రం అంతగా రాణించలేకపోయింది. దీనికి 1.67 మిలియన్ వచ్చాయి. తద్వారా ఇండియాలో ఎక్కువ లైకులు సాధించిన టీజర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో ఫస్ట్ 'కేజీఎఫ్ చాప్టర్ 2', సెకెండ్ ప్లేస్‌లో 'మాస్టర్' మూవీలు కొనసాగుతున్నాయి.

 Prabhas

4లో మూడు ప్రభాస్‌వేగా: 'సలార్' మూవీ టీజర్ ఇండియాలో టాప్ ప్లేస్‌ను సాధించడంతో పాటు ప్రభాస్ ఖాతాలో మరో రికార్డును కూడా తీసుకు వచ్చింది. నేషనల్ వైడ్‌గా ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ల జాబితాతో ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు ఉండడం విశేషం. అందులోనూ టాప్ 4 చిత్రాల్లో మూడు 'సలార్', 'ఆదిపురుష్', 'రాధే శ్యామ్' ఉన్నాయి. దీంతో అతడు సంచలనం సృష్టించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X