ప్రభాస్ కొత్త సినిమాపై అదిరిపోయే అప్‌డేట్: అప్పటి వరకూ అక్కడే ఉండేందుకు ప్లాన్
కెరీర్ ఆరంభంలో తెలుగు సినీ ఇండస్ట్రీకే పరిమితమైనా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ స్టార్ హీరో.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని ఉన్నాడు. అందులో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించే 'రాధే శ్యామ్' మూవీ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇది వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనితో పాటు ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి.
బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇది రామాయణం నాటి కథతో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందుతోంది. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఆ మధ్య నిలిచిపోయిన ఈ సినిమా షూట్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. అప్పటి నుంచి ముంబైలోని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుతూనే ఉన్నారు.

వాస్తవానికి 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. అందులో హీరోగా నటిస్తోన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రం పెద్దగా షూటింగ్‌లో పాల్గొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు ముంబైలో అడుగు పెట్టాడు. అక్కడ డ్యాన్స్ రిహాల్సస్‌లో కూడా కొద్ది రోజుల పాటు పాల్గొన్నాడు. అనంతరం సినిమాలోని పర్‌ఫెక్ట్ లుక్ కోసం పలు రకాల కసరత్తులు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గురించి, ప్రభాస్ కేటాయించిన డేట్స్ గురించి కొన్ని ఆసక్తికరమై విషయాలు బయటకు వచ్చాయి. దీంతో ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శనివారం నుంచే 'ఆదిపురుష్' షూటింగ్‌లో పాల్గొంటున్నాడట. ఇప్పుడు ముంబై నగర శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దీనికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక, ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ మూడో వారం వరకూ ఏ మాత్రం బ్రేక్ లేకుండా సాగనుందట. ప్రభాస్ అప్పటి వరకూ అక్కడే ఉంటాడని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంటే.. ఈ మూవీ షూట్ పూర్తి చేసే వరకూ అతడు మరో దానిపై ఫోకస్ చేయడని అర్థం అవుతోంది.
క్రేజీ కాంబోలో రాబోతున్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











