టీవీ షోలో సీనియర్ హీరోయిన్ చీర కొంగును పట్టుకున్న ప్రభాస్.. ఇలా ఎప్పుడూ చూసుండరు.!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సాహో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చేసిన ఓ పని హాట్ టాపిక్ అవుతోంది.

ట్రైలర్‌తో రెట్టింపు
కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు, ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో అవి రెట్టింపయ్యాయి. ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.

ప్రమోషన్ షురూ
త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే ప్రభాస్ - శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీని తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది సాహో యూనిట్.

నచ్ బలియే షోలో హల్‌చల్
బాలీవుడ్ ప్రేక్షకులకు సాహో చిత్రాన్ని చేరువ చేయడానికి ప్రభాస్, శ్రద్ధ కపూర్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అదే సమయంలో బాలీవుడ్ షోలకు వెళ్తున్నారు. ఇక, బుధవారం వీరిద్దరు కలిసి ప్రముఖ కథానాయకుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్ బలియే 9' డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. అక్కడ ప్రభాస్ హల్‌చల్ చేశాడు.

చీర కొంగును పట్టుకున్నాడు
ఈ షోకు వెళ్లిన సమయంలో ప్రభాస్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా దర్శనమిచ్చాడు. షో జరుగుతున్న సమయంలో స్టేజ్‌పైన న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రవీనా టాండన్ చీర కొంగును నోటితో పట్టుకుని.. ‘కిక్' సినిమాలోని ‘జుమ్మేకీ రాత్ హై..' పాటకు స్టెప్పులు వేశారు. ఈ షోలో ‘సాహో' జంట దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సాహో గురించి
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











