ఆలియా భట్‌కు ప్రభాస్ సపోర్ట్.. ఆ రూమర్స్ మళ్లీ వైరల్!

Prabhas - Alia Bhatt: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ కు కేవలం దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చా క్రేజ్ ఉంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రెబల్ స్టార్ ఓ విషయంతో వార్తల్లో నిలిచారు. ఎందుకంటే.. ప్రభాస్ తనతో కలిసి నటించినా, నటించకపోయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సపోర్టు ఇస్తాడనే విషయం తెలిసిందే.అలా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కు కూడా ప్రభాస్ సపోర్టుగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ పోస్ట్ పలు రూమర్స్ కు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Also Read
Akhil Raj: ముదిరిన గొడవ.. హీరో అఖిల్ రాజ్‌కు ఊహించని షాక్.. రంగంలోకి పోలీసులు!
Akhil Raj: ముదిరిన గొడవ.. హీరో అఖిల్ రాజ్‌కు ఊహించని షాక్.. రంగంలోకి పోలీసులు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఆల్ఫా'. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి మహిళా ప్రధాన చిత్రంగా ఇది తెరకెక్కింది. శార్వరి మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివ్ రావైల్ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ .. ఆల్ఫా సినిమా ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రభాస్ చేసిన ఈ సాధారణ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది.

Prabhas Supports Alia Bhatt s Alpha Kalki 2 Rumours Trend After Viral Instagram Post
Recommended For You
అందుకే పవన్ కళ్యాణ్, నాని సినిమాలు రిజెక్ట్ చేశా.. ఫోక్ బ్యూటీ నాగదుర్గ కామెంట్స్ వైరల్!
అందుకే పవన్ కళ్యాణ్, నాని సినిమాలు రిజెక్ట్ చేశా.. ఫోక్ బ్యూటీ నాగదుర్గ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ఆల్ ది బెస్ట్ టు ఆలియాభట్ అండ్ ఆల్పా టీం ' అంటూ ట్రైలర్‌ను షేర్ చేశారు. ప్రభాస్ నుంచి వచ్చిన ఈ సపోర్ట్‌పై ఆలియా భట్ కూడా వెంటనే స్పందించారు. థ్యాంకు సో మాచ్ అంటూ తన సోషల్ మీడియా స్టోరీ ద్వారా ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ఈ చిన్న సోషల్ మీడియా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది.

అయితే ఈ పోస్టు వెనుక మరో కారణం ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో ఆలియా భట్ కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్నారని కూడా పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రత్యేకంగా ఆలియా సినిమాకు మద్దతు తెలపడం, దానికి ఆలియా వెంటనే స్పందించడం చూసి అభిమానులు "ఇది కల్కి-2 కనెక్షనేనా?", "ఇద్దరూ త్వరలో ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారా?" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

You May Also Like
Tamannaah Net Worth: తమన్నా అధికారిక ఆస్తులు ఎన్ని కోట్లు.. మిల్కి బ్యూటీ కోట్లాది సంపద ఎలా అంటే?
Tamannaah Net Worth: తమన్నా అధికారిక ఆస్తులు ఎన్ని కోట్లు.. మిల్కి బ్యూటీ కోట్లాది సంపద ఎలా అంటే?

అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు కల్కి 2 మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆలియా భట్ నిజంగానే 'కల్కి 2'లో నటిస్తున్నారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అందువల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అధికారిక సమాచారం అని భావించలేం. చిత్ర యూనిట్ ప్రకటించే వరకు ఇవి కేవలం ఊహాగానాలుగానే పరిగణించాలి.

ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా 2026 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఐదుగురితో కమిట్‌మెంట్.. అలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తాయి
ఐదుగురితో కమిట్‌మెంట్.. అలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తాయి

ఇదిలా ఉంటే, ఆలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ఆల్ఫా' సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌కు సోషల్ మీడియాలో సానుకూల స్పందన లభిస్తుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతుందటంతో ఈ యాక్షన్, స్పై థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

.

Read more about: kalki 2898 ad alia bhatt prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X