ఆ వ్యామోహంలో పడిన ప్రభాస్.. డైరెక్టుగా ఇంటికే తీసుకెళ్లిన సాహో!

Recommended Video

Prabhas Wants To Take Bikes And Cars To Home Used In Saaho | FilmiBeat Telugu

ప్రతిష్టాత్మకంగా రూపొందే చిత్రాల్లో నటించే నటీనటులకు ఆ చిత్రంలో ఉపయోగించిన వస్తువులు, క్యాస్టూమ్స్, ఇతర అంశాలపై చాలా ఎక్కువగా మక్కువ పెంచుకొంటారు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వాటిని తమతోటే ఉంచుకోవడానికి ఇష్టపడుతారు. ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి కూడా అదే. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రంలో వాడిన వస్తువులు, వాహనాలపై అమితంగా ఇష్టంగా పెంచుకొన్నారట. వాటి కోసం ప్రభాస్ ఏం చేశారంటే..

సాహో చిత్రంలో వాడిన కార్లు, బైక్స్

సాహో చిత్రంలో వాడిన కార్లు, బైక్స్

సాహో చిత్రం పవర్ ఫుల్, హై టెన్షన్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్నది. ఈ చిత్రాన్నిదర్శకుడు సుజిత్ రెడ్డి హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక అంశాలతో కలిపి టాలీవుడ్‌ చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం అత్యాధునిక కార్లు, బైకులు, ట్రక్స్ వాడటం జరిగింది.

ప్రభాస్ ఇంట్లోకి సాహో వస్తువులు

ప్రభాస్ ఇంట్లోకి సాహో వస్తువులు

సాహో చిత్రంలో నటించిన యాక్టర్లతోనే కాకుండా అందులో వాడిన ట్రక్కులు, కార్లు, బైక్స్‌పై ప్రభాస్ ఇష్టం పెంచుకొన్నారట. షూటింగ్ పూర్తయిన తర్వాత వాటిని తన వద్దే ఉంచుకోవడానికి నిర్ణయం తీసుకొన్నారట. కోట్లు విలువ చేసే వాహనాలను తనకు ఇవ్వమని దర్శకుడు, నిర్మాతలను కోరాడట. ఈ చిత్రం సొంత బ్యానర్‌లో రూపొందడటం వల్ల వాటిని తన వద్దే ఉంచుకోవడం సులభమైపోయింది.

పడిన కష్టానికి తీపిగుర్తులుగా వాహనాలు

పడిన కష్టానికి తీపిగుర్తులుగా వాహనాలు

సాహో యాక్షన్ సీన్ల కోసం ప్రభాస్ చాలా ఎక్కువగా కష్టపడ్డారు. వాన, దుమ్ము, ధూళిని లెక్క చేయకుండా ఫైట్స్ సీక్వెన్స్‌లో పాల్గోన్నాడు. ఫైట్స్ కోసం వాడిన వాహనాలను ప్రత్యేకంగా డిజైన్ చేయడంతో వాటి ఆకర్షణకు లోనయ్యారట. అందుకే వాటిని తనతోపాటే ఉంచుకోవాలని, వాటిని తన గ్యారేజ్‌లో గుర్తుగా పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారట.

రూ.300 కోట్లతో సాహో

రూ.300 కోట్లతో సాహో

సాహో చిత్రం రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్నది. గతేడాది దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద తెరకెక్కించిన యాక్షన్ సీన్ల కోసమే రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే రూ.30 కోట్లు ఖర్చు చేశారనేది సినీ వర్గాలు టాక్. నేషనల్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన శ్రద్ధాకపూర్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X