Prabhas: రామమందిరం కోసం ఆదిపురుష్ 50 కోట్లు... అసలు విషయం చెప్పిన ప్రభాస్ టీమ్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గత ఏడాది ఆదిపురుష్, సలార్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాల్లో సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ రామ మందిర నిర్మాణానికి 50 కోట్ల రూపాయల విరాళం ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు జై శ్రీరామ్. జనవరి 22న అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నూతన రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మన తెలుగు నుంచి చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోలు హాజరుకానున్నారు. బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్..అమితాబ్ బచ్చాన్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు.

 Prabhas team clarified on the news that Prabhas donated 50 crores for the construction of Ram Mandir

ఇక తెలుగు నుంచి ఆదిపురుష్ ప్రభాస్ కు ఆహ్వానం అందింది. అయితే ఈ హీరో.. రామ మందిర నిర్మాణానికి ప్రభాస్ 50 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లు బాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. రాముడి కోసం.. ఈ ఆదిపురుష్ తన వంతు సాయం చేస్తు్న్నాడు అంటూ కథానాలు వెలువడ్డాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Prabhas team clarified on the news that Prabhas donated 50 crores for the construction of Ram Mandir

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించింది. అవన్నీ అవాస్తవము అంటూ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ మాటల్లో నిజం లేదని చెప్పుకువచ్చింది. రామ్ మందిరంకు 50 కోట్లు విరాళం ఇవ్వలేదనే ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇస్తూ ఓ నోట్ విడుదల చేసింది. ఇక ప్రభాస్ మీద వస్తున్న ఈ వార్తలకు చెక్ పడిందని చెప్పవచ్చు.

జనవరి 22న జరగనున్న విగ్రహ ప్రతిష్టకి భారతదేశంలోని అంత్యంత ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయనే విషయం తెలిసిందే. వీరిలో ప్రభాస్ కూడా ఉన్నాడు కాబట్టి జనవరి 22న అయోధ్యకి వెళ్లనున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు సలార్ తో హిట్ కొట్టిన ఈ హీరో... మారుతి దర్శకత్వంలో రాజా డిలాక్స్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

 Prabhas team clarified on the news that Prabhas donated 50 crores for the construction of Ram Mandir

మరోవైపు కల్కి 2898 AD సినిమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ చిత్రంగా రాబోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్, దీపిక పదుకునే, దిశా పటానీ ఇలా ప్రముఖులు అంతా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X