Don't Miss!
- News
వేగం పెరిగింది: సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో కేంద్రమంత్రి జైశంకర్
- Sports
టీ20లకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరో నాకైతే అస్సలు తెలియదు.. శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Finance
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. డీఏ పెంపుపై కుండబద్ధలు కొట్టిన కేంద్ర మంత్రి..
- Lifestyle
ఈ లక్షణాలు ఉంటే మీ మెదడు వయసు మీకంటే పెద్దదని అర్థం...!
- Technology
రాబోయే Vivo ఫోల్డబుల్ మొబైల్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
వాళ్ళకి అదిరిపోయే పార్టీ ఇచ్చిన ప్రభాస్.. పార్టీలో లెజెండ్ హీరో బాలీవుడ్ బ్యూటీ!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో రాధే శ్యామ్ సినిమాల అనంతరం మరిన్ని విభిన్నమైన పాన్ ఇండియా సినిమాలను పూర్తి చేయడంలో చాలా బిజీగా మారిపోయాడు. బాహుబలి 2 సినిమా తరువాత సరైన సక్సెస్ అందుకోలేని ప్రభాస్ తదుపరి సినిమాలతో మాత్రం ఎలాగైనా మంచి విజయాలను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలు చూస్తే మాత్రం తప్పకుండా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటాయని అనిపిస్తోంది.
ముందుగా ప్రభాస్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత సలార్ సినిమా కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక లైనప్ లో ఉన్న ప్రాజెక్టు K ను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు.

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో రూపొంధిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. ఇక రీసెంట్ గా ఒక అద్భుతమైన షెడ్యూల్ ను పూర్తి చేయడంతో ప్రభాస్ ఆనందంలో చిత్రయూనిట్ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ లోని హోటల్ సీతారాలో ఒక పార్టీని కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే ఆ పార్టీలో లో దర్శకుడు నాగ్ అశ్విన్ నటీనటులు నిర్మాత అశ్వినీ దత్ తో పాటు లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అలాగే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పదుకొనే కూడా పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. సాధారణంగా ప్రభాస్ ఎక్కువగా తన టీం సభ్యులందరికీ కూడా భోజనాలతో నే ఎప్పటికప్పుడు పార్టీ ఇస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ప్రత్యేకంగా షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా ఖరీదైన స్టైలిష్ పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం పనులన్నీ కూడా వచ్చే ఏడాది చివరికి పూర్తవుతాయట. సినిమాను 2024 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని సమాచారం.