‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ షాకింగ్ డెసీషన్: సరికొత్తగా కనిపించేందుకే ఈ నిర్ణయం
పేరుకు తెలుగు హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని సైతం సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ మూవీ దెబ్బకు యూనివర్శల్ స్టార్ అయ్యాడు. దీంతో అప్పటి నుంచి వరుసగా పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. అందులో 'ఆదిపురుష్' కూడా ఒకటి.
క్రియేటివ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో.. రామయాణంలో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్ర కోసం అతడు బాగా బరువు తగ్గబోతున్నాడట. దీని కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, ఇందుకోసం గతంలో తనతో పని చేసిన పర్సనల్ ట్రైనర్‌ను సైతం రప్పించాడనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్'ను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











