మరో బాలీవుడ్ భామతో ప్రభాస్ రొమాన్స్: వెంకటేష్, బాలయ్య తర్వాత యంగ్ రెబెల్ స్టార్

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సూపర్ డూపర్ హిట్ అవడంతో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత వరుస సినిమాలతో ఫుల్ జోష్‌తో దూసుకుపోతున్నాడు. రెండేళ్ల క్రితం 'సాహో' వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న 'రాధే శ్యామ్'లో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరో మూడు ప్రాజెక్టులను ప్రకటించి షాకిచ్చాడు. వీటిని ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో సినిమాకూ పచ్చజెండా ఊపాడు.

'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' వంటి యాక్షన్ మూవీలను తెరకెక్కించి.. బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరొందాడు సిద్దార్ధ్ ఆనంద్. అతడితో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుంచో ఓ వార్త అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన అయితే రాలేదు కానీ.. ఎన్నో ఊహాగానాలు మాత్రం ప్రచారం అవుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై భారీ స్థాయిలో బజ్ ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రభాస్ - సిద్దార్ధ్ కాంబోపై తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

Prabhas to Romance with Katrina Kaif in Siddharth Anand Movie

బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో టాల్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుందట. ఇప్పటికే ఆమెకు సిద్దార్ద్ ఆనంద్ కథను కూడా వినిపించాడని ప్రచారం జరుగుతోంది. అది ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. గతంలో కత్రినా కైఫ్.. విక్టరీ వెంకటేష్‌తో 'మల్లీశ్వరి', నందమూరి బాలకృష్ణతో 'అల్లరి పిడుగు' అనే సినిమాలను చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో తెలుగు హీరోతో నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X