రాముడి పాత్ర కోసం ప్రభాస్ స్పెషల్ ప్లాన్.. అప్పుడే బాణాలతో ప్రయోగాలు..
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒక విధంగా ఆయనపై బరువు బాధ్యతలు ఇంకా ఎక్కువయ్యాయనే చెప్పాలి. బాహుబలి దెబ్బకు అసలైన పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకోవడంతో అంచనాలు అంతకు మించిన రేంజ్ కి వెళుతున్నాయి. ఒక విధంగా సాహో సినిమాతో ప్రభాస్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించలేకపోయాడు.
ఇక నెక్స్ట్ సినిమాలు అలా కాకుండా పాన్ ఇండియా అభిమానులకు అన్ని రకాలుగా సరికొత్త ఫీల్ ని కలిగించేలా ఉండాలని ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇటీవల ఆది పురుష్ అనే సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రామాయణ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్టుకు అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి కూడా ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం రాముడి పాత్ర కోసం ప్రభాస్ అప్పుడే ఒక స్పెషల్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఫిట్నెస్ పై ఒక లుక్ ని ఇప్పటికే డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే మూడు నెలల ముందు ఫిట్నెస్ కి సంబంధించిన వర్కౌట్స్ స్టార్ట్ చేస్తాడట.
ఇక ఇప్పుడు మాత్రం రాముడి ప్రధాన ఆయుధమైన విలు విద్యను కూడా అలవాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాణాలతో సరికొత్తగా ప్రయోగాలు చేయడానికి ఇంటివద్దనే ఒక స్పెషల్ సెటప్ కూడా రెడీ చేసుకున్నారట. మరి ఈ స్పెషల్ ట్రైనింగ్ ప్రభాస్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











