For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో తెలుగు డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ: ఊహించని టైటిల్‌తో ప్రాజెక్టు.. అసలు ట్విస్ట్ ఏంటంటే!

  |

  సుదీర్ఘ కాలంగా తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి.. కొన్నేళ్ల నుంచి ఇండియా మొత్తం తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. చాలా కాలం వరకూ తెలుగు సినిమాలను మాత్రమే చేసిన అతడు.. 'బాహుబలి' నుంచి పంథాను మార్చుకున్నాడు. అప్పటి నుంచి పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు.

  దీంతో అతడు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని సందడి చేస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి ఎన్నో సినిమాలను సైతం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  రాధే శ్యామ్‌గా రెడీ అయిన ప్రభాస్

  రాధే శ్యామ్‌గా రెడీ అయిన ప్రభాస్


  రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రమే ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో వాయిదా వేశారు.

  Priyanka Chopra: సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక చోప్రా.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచలన ప్రకటన

  రెండు చిత్రాల షూటింగ్‌లతో బిజీ

  రెండు చిత్రాల షూటింగ్‌లతో బిజీ

  పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఒక పక్క ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్' అనే మూవీని చేస్తున్నాడు. ఈ రెండింటికి సంబంధించిన షూటింగ్‌లలో వీలును బట్టి పాల్గొంటున్నాడు. ఇందులో ఆదిపురుష్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది.

  పాన్ వరల్డ్ మూవీ కోసం చాలానే

  పాన్ వరల్డ్ మూవీ కోసం చాలానే

  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కించే మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందనుంది. ఇందులో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, సినిమా టైం మెషీన్‌ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన ‘ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. దీనికోసం ప్రభాస్ చాలా రోజులే ఇచ్చాడు.

  దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  అర్జున్ రెడ్డి దర్శకుడితో కాప్ స్టోరీ

  అర్జున్ రెడ్డి దర్శకుడితో కాప్ స్టోరీ

  రెబెల్ స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను కూడా ప్రకటించాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే దీనికి ‘స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు. దీన్ని భూషన్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

   మారుతితో సినిమా చేస్తున్నాడని

  మారుతితో సినిమా చేస్తున్నాడని


  ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అతడు ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు మారుతితో సినిమా చేయబోతున్నాడని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీంతో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

  నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

  నిర్మాత ఆయనే.. టైటిల్ ఇదేనట

  నిర్మాత ఆయనే.. టైటిల్ ఇదేనట

  ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టు ‘రాజా డీలక్స్' అనే టైటిల్‌తో రాబోతుందట. హర్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఓ న్యూస్ తెగ వైరల్ అయిపోతోంది.

  Prabhas Project K| AP Movie Tickets Rates| Tollywood Updates | Filmibeat Telugu
  ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే

  ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే

  వాస్తవానికి డీవీవీ దానయ్యతో ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే, మారుతి కూడా ఓ మూవీ కమిట్ అయ్యాడు. అందుకే ఇప్పుడు వీళ్లిద్దరినీ కలిపి ‘రాజా డీలక్స్' స్క్రిప్టుతో సినిమా చేయాలని దానయ్య భావిస్తున్నారట. అయితే, ఇప్పటి వరకూ ఈ స్క్రిప్టును ప్రభాస్ వినలేదని తెలిసింది. మరి అది విన్న తర్వాత మారుతి కథకు అతడు ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి.

  English summary
  Prabhas Now Doing Several Movies At a Time. Now This Star Hero Ready to do a Film with Maruthi under DVV Danayya Production.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion