హాట్ టాపిక్: నాగ్ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ అంతా.. టాలీవుడ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న హీరోగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక్కడే నిలిచాడు. చాలా కాలంగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో అతడి పేరు మారుమ్రోగిపోయింది. ఆ సినిమాతో అన్ని ఇండస్ట్రీల్లో ప్రభాస్ హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు భారీ ప్రాజెక్టులనే చేస్తున్నాడు. తాజాగా రెబెల్ స్టార్ మరో బిగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు అతడు భారీ స్థాయిలో చార్జ్ చేస్తున్నాడు. తాజాగా ఆ వివరాలు లీక్ అయ్యాయి.

ఇక్కడ తక్కువే.. అక్కడ మాత్రం భారీ స్థాయిలో
‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిందీ సినిమా.

ఇప్పటి వరకు కనిపించని పాత్రలో ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతడు ఇప్పటి వరకు కనిపించిన సరికొత్త పాత్రను పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది.

ఎన్నో బయటకు వచ్చాయి.. క్లారిటీ మాత్రం లేదు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పలానా ఆర్టిస్టులు నటిస్తున్నారని, ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే అని ఇలా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే, దేని విషయంలోనూ క్లారిటీ మాత్రం రావడం లేదు. మరోవైపు ఈ మూవీకి ‘ఓ డియర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

నాగ్ అశ్విన్‌తో సినిమా.. పాన్ వరల్డ్ లెవెల్
ప్రస్తుతం ‘ఓ డియర్'లో నటిస్తున్న ప్రభాస్.. తన తదుపరి సినిమాను ఇటీవలే ప్రకటించాడు. ‘మహానటి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. పాన్ వరల్డ్ లెవెల్‌లో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

నాగ్ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ అంతా
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు గానూ ప్రభాస్ అందుకోబోతున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త లీక్ అయింది. ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ మూవీ కోసం అతడు ఏకంగా రూ. 100 - 110 కోట్లు తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం.!
తెలుగు సినీ చరిత్రలో వంద కోట్లు రూపాయలు పారితోషికంగా అందుకున్న హీరో లేడు. ఇప్పుడా ఘనతను ప్రభాస్ అందుకోబోతున్నాడని అంటున్నారు. అయితే, యంగ్ రెబెల్ స్టార్ ఈ సినిమాకు చేస్తున్న చార్జ్ రూ. 50 కోట్లు మాత్రమేనని, మిగిలిన మొత్తం సినిమా లాభాల్లో అతడికి వచ్చే వాటా అని ఓ న్యూస్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











