ప్రభాస్ మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. వాటి ముందు ఇప్పుడొచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ!

రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ పాన్ ఇండియా హీరోగా ఏ స్థాయికి వచ్చాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈశ్వర్ సినిమా విడుదలైన సమయంలో అతను ఈ స్థాయికి వస్తాడని ఎవరు కలలో కూడా అనుకోలేదు. మొదటి సినిమాలో అతని నటనపై విమర్శలు చాలా వచ్చినప్పటికీ ప్రభాస్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. పెదనాన్న కృష్ణం రాజు సపోర్టుతో ఉన్నప్పటికీ సొంతంగానే సినిమా అవకాశాలను అందుకున్నాడు. సినిమా సినిమాకు తనను తాను సరికొత్త నటుడిగా మార్చుకుంటు అగ్ర దర్శకులు కమర్షియల్ దర్శకులను ఎట్రాక్ట్ చేశాడు.

సక్సెస్ లో ఙన్న చాలామంది డైరెక్టర్స్ అతనితో ఎలాగైనా ఒక సినిమా చేయాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. ప్రభాస్ కు బాక్సాఫీస్ హోదా అంత ఈజీగా ఏమీ రాలేదు. మొదట్లో మంచి కథలను కూడా అతను మిస్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ ఆస్తులపై ఎప్పటికప్పుడు అనేక రకాల కథనాలు వస్తుంటాయి. అయితే ఇటీవల వారికి దగ్గరి బంధువు అయినటువంటి ఒక సీనియర్ నటుడు ప్రభాస్ ఆస్తులపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. బయట వస్తున్న టాక్ అయితే నిజమే అంటూ అలాగే డార్లింగ్ పెళ్లిపై కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఎంత మంచివారంటే..

ఎంత మంచివారంటే..

ప్రభాస్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి మనందరికీ తెలిసిన విషయమే. నిజానికి అతనికి బాహుబలి లాంటి కదా కూడా సరైనదే అని దర్శకుడు రాజమౌళి వివరణ ఇచ్చారు. బాడీ లాంగ్వేజ్ లోనే కాకుండా మంచి మనసులో కూడా అతను నిజమైన రాజు అని ఎవరైనా చెబుతారు. వీలైనంతవరకు మనిషికి సహాయం చేయాలనుకునే ఎంతో మంచి మనసున్న మహారాజు ప్రభాస్. నమ్మిన వాళ్ల కోసం ఎంత దూరమైనా కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక ఎవరైనా సరే ప్రభాస్ ఇంటికి వస్తే కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తారని అందరికీ తెలిసిన విషయమే.

బాహుబలి కంటే ముందు వరకు

బాహుబలి కంటే ముందు వరకు

సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా సరే స్టార్ హోదా వచ్చిన తర్వాతనే వారి ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటూనే ఉంటారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అతని ఒక్క సినిమా రెమ్యునరేషన్ తో పోల్చితే.. బాహుబలి కంటే ముందు వరకు ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్స్ చాలా తక్కువ. బాక్సాఫీసు వద్ద తన రేంజ్ ను అమాంతంగా పెంచుకుంటాం రెమ్యునరేషన్ డోసును కూడా గట్టిగానే పెంచుతున్నాడు.

ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటాడు అంటే..

ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటాడు అంటే..

ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడం కామన్ గా వస్తున్నదే. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు వంద కోట్లు తీసుకుంటున్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభాస్ కు ఉన్న ఆస్తుల విలువ తో పోలిస్తే ఈ రెండు రెమ్యునరేషన్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఇటీవల వారి దగ్గర బంధువు నటుడు అయినటువంటి నాగరాజు ప్రభాస్ ఆస్తుల పై ఒక ప్రత్యేకమైన వివరణ ఇచ్చారు.

వేల ఎకరాలు

వేల ఎకరాలు

ప్రభాస్ ఆస్తుల పై అయితే అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఎవరు కూడా అంతగా క్లారిటీ ఇవ్వలేదు దాదాపు వేల ఎకరాలు ఉన్నాయని ప్రభాస్ ఆస్తుల మొత్తం విలువ అయితే ఏడు వేల కోట్లకు పైగా ఉంటుందని.. అది కూడా కేవలం మొగల్తూరు సామ్రాజ్యంలోనే వారి తాతలు సంపాదించినవని ఎన్నో కథనాలు వచ్చాయి. ఇక వాటిపై వారి దగ్గరి బంధువు అయినటువంటి నాగరాజు ప్రత్యేకత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

వాటి మొత్తం విలువ ఎంతంటే

వాటి మొత్తం విలువ ఎంతంటే

ఒకప్పుడు ప్రభాస్ కుటుంబీకులు వేల రూపాయలకు, వంద రూపాయలకు కూడా ఎకరం భూములను కొనేవారు అని అయితే ప్రస్తుతం వాటి విలువ ఒక్కసారిగా పెరిగి పోయిందని తెలిపారు. ఇప్పుడు ఒక్క ఎకరం కోటి రూపాయలు పలుకుతోంది కాబట్టి వారి ఆస్తుల విలువ ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే వేల కోట్లకు పైగానే ఉంటాయనీ తెలియజేశారు. విండో ప్రభాస్ ఆస్తులపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ప్రభాస్ పెళ్లి..

ప్రభాస్ పెళ్లి..

ఇక ప్రభాస్ పెళ్లి విషయంపై కూడా ఆయన ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. త్వరలోనే ప్రభాస్ తన దగ్గరి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. నిజానికి ప్రభాస్ కోసమైతే సంబంధాలు చూస్తున్నారు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాడానికి మాత్రం చాలా మంది సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే శుభకార్యం జరగాలని తాను కూడా బలంగా కోరుకుంటున్నట్లు నాగరాజు వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇక KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా భారీ ఎత్తున సమ్మర్ లో విడుదల కాబోతోంది. మొదటి సారి పూర్తిగా బాలీవుడ్ టెక్నీషియన్స్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

అలాగే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను ఇటీవల స్టార్ట్ చెశాడు. ఆ ప్రాజెక్ట్ హాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక 2024 చివరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X