‘సలార్’ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్: ఇందులో ప్రభాస్ అలా కనిపించబోతున్నాడట
వరుస సినిమాలతో ఫుల్ జోష్‌ను చూపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తోన్న అతడు.. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను ప్రకటించాడు. అందులో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' ఒకటి. ఆలస్యంగా అనౌన్స్ చేసినా.. ముందే పట్టాలెక్కిన ఈ సినిమా విషయంలో కొద్ది రోజులుగా ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. 'సలార్'లో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్కులతో కనిపించనున్నాడట. సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన మొదటి షెడ్యూల్ సమయంలో గడ్డాన్ని ట్రిమ్ చేసి యంగ్ మ్యాన్‌గా కనిపించిన అతడు.. సినిమా ప్రకటన సమయంలో క్లీన్ షేవ్‌తో పాటు కోరమీసంతో ఉన్న లుక్‌తో దర్శనమిచ్చాడు. ఇప్పుడలాగే 'జాతిరత్నాలు' సినిమా ప్రెస్‌మీట్‌లో కనిపించాడు. దీంతో 'సలార్'లో ప్రభాస్ కనిపించనున్న లుక్కుల విషయంలో క్లారిటీ వచ్చినట్లైంది. అయితే, అతడు ఒకే పాత్రలో రెండు విధాలుగా ఉంటాడా? లేక డుయల్ రోల్ చేస్తున్నాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్'ను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్ భామ శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం సింగరేణి బొగ్గు గనుల్లో ప్రారంభమైంది. అక్కడ దాదాపు పది రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక, దీన్ని 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.


Click it and Unblock the Notifications











