Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తండ్రి లేని యువ హీరోకు ప్రభాస్ భారీ ఆఫర్స్.. బ్రేక్ ఇచ్చిన దర్శకుడికి అలా రుణం..
ఒక సినిమా అనేది బిజినెస్ మాత్రమే.. ఇక్కడ సెంటిమెంట్స్ హిట్స్ ఉన్నప్పుడే కనిపిస్తాయని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సహాయం చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోరు. అలాంటి వారిలో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కి ఎవరైనా నచ్చితే అంత ఈజీగా వదిలిపెట్టడని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన విషయం. ఇక ఎప్పుడో తనకు వర్షం సినిమా ద్వారా మొదటి హిట్టిచ్చిన దర్శకుడి ఋణం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు.
ఆ దర్శకుడు చాలా క్లోజ్..
మొదట ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలతో పెద్దగా సంతృప్తి చెందని సమయంలో ఎలాగైనా బలమైన బాక్సాఫీస్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూసిన ప్రభాస్ కి వర్షం సినిమా ద్వారా బ్రేక్ వచ్చింది. ఆ సినిమాతోనే దర్శకుడు శోభన్ ప్రభాస్ కి చాలా క్లోజ్ అయ్యాడు. మళ్ళీ వారి కాంబినేషన్ లో సినిమా రానుందని అప్పట్లో రూమర్స్ గట్టిగానే వచ్చాయి. కానీ 2008లోనే శోభన్ గుండెపోటుతో మరణించాడు.
ఆయన కొడుకు కోసం..
వర్షం సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అందుకే ఆ సినిమా దర్శకుడంటే ప్రభాస్ అమితంగా ఇష్టపడతారు. ఇక శోభన్ తో మరోసారి కలిసి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. అందుకే ఆయన కొడుకు కోసం ఏదైనా చేయాలని ప్రభాస్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ఇప్పటికే కొన్ని సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కి కాస్త దగ్గరయ్యాడు.
ఆ హీరో కోసం రెండు సినిమాలు..
తను నేను, పేపర్ బాయ్ వంటి సినిమాల్లో నటించిన సంతోష్ పెద్దగా క్లిక్కవ్వలేదు. అప్పట్లో ప్రభాస్ ఆ సినిమాల ప్రమోషన్స్ లో కూడా హెల్ప్ చేశాడు కూడా. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇప్పుడు అతనికి రెండు సినిమాలు రాబోతున్నాయి. సంతోష్ కోసం ఎలాగైనా సరే రెండు మంచి కథలను సెట్ చేయాలని ప్రభాస్ యూవీ క్రియేషన్స్ ని కోరినట్లు తెలుస్తోంది.
Recommended Video
ప్రభాస్ ఆలోచన మేరకు
కేవలం ప్రభాస్ తోనే కాకుండా యూవీ క్రియేషన్స్ బయట హీరోలతో కూడా వర్క్ చేయడానికి సిద్ధమవుతోంది. ఎక్కువగా ప్రభాస్ ఆలోచన మేరకు ఇతర హీరోలకు అవకాశాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సంతోష్ శోభన్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చేలా రెండు సినిమాలను ప్లాన్ చేయాలని తన హోమ్ బ్యానర్ కి సజెస్ట్ చేశాడు. దీంతో యూవీ క్రియేషన్స్ కూడా ఆ యంగ్ హీరోకి సెట్టయ్యే విదంగా కథలను రెడీ చేయిస్తున్నట్లు సమాచారం.