For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆదిపురుష్ సెట్స్‌లో స్టైలిష్ లుక్‌లో ప్రభాస్: వాళ్లందరి నోళ్లు మూయించేంత హ్యాండ్సమ్‌గా!

  |

  సీనియర్ హీరో కృష్ణం రాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో.. చాలా కాలం పాటు పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'మిర్చి' నుంచి తన పంథాను మార్చుకుని సక్సెస్ బాటలో పయనించాడు. ఇక, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఈ హీరో వెనుదిరిగి చూడకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.

  అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

  ప్రభాస్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని ఉన్నాడు. అందులో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించే 'రాధే శ్యామ్' మూవీ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇది వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనితో పాటు ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇది రామాయణం నాటి కథతో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందుతోంది. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది.

  Prabhas Ultra Stylish Look in Adipurush Sets

  'ఆదిపురుష్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఆ మధ్య నిలిచిపోయిన ఈ సినిమా షూట్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. ఇందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాల్గొంటున్నాడు. ముంబై నగర శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దీనికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక, ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ మూడో వారం వరకూ ఏ మాత్రం బ్రేక్ లేకుండా సాగనుందట. ప్రభాస్ అప్పటి వరకూ అక్కడే ఉంటాడని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  'ఆదిపురుష్' సినిమాతో ప్రభాస్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల అతడు ఫ్యాట్‌గా ఉన్న ఫొటో ఒకటి బయటకు రావడంతో దీన్ని హైలైట్ చేస్తూ బాలీవుడ్‌లో చాలా మంది మన హీరోపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆదిపురుష్' సెట్స్‌లో ప్రభాస్ దిగిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. లక్ష్మణుడి పాత్రను చేస్తున్న సన్నీ సింగ్ తీసిన ఈ పిక్‌లో యంగ్ రెబెల్ స్టార్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తున్నాడు. దీంతో అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ స్టార్ హీరో మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

  English summary
  Young Rebel Star Prabhas Now Doing Adipurush Movie Under Om Raut Direction. Now Prabhas Ultra Stylish Look Photo Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X