Prabhas ఫ్యాన్స్ కోసం సలార్ సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్న ప్రశాంత్ నీల్.. ఎప్పుడంటే?
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న అన్ని సినిమాల మీద ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి ఏర్పడుతోంది. ఆయన లైనప్ చూస్తుంటే ఎలాంటి హీరో కైనా మెంటల్ ఎక్కి పోవడం ఖాయం. ప్రభాస్ హీరోగా ఆది పురుష్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా మీద కాస్త అంచనాలు తక్కువగానే ఉన్న ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న సలార్ సినిమా మీద మాత్రం ఊహించని స్థాయిలో బజ్ క్తియేట్ అవుతోంది.
ప్రేక్షకుల దృష్టితో పాటు ప్రభాస్ అభిమానుల దృష్టి కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే KGF సిరీస్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ లాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సలార్ సినిమా రూపొందుతూ ఉండడంతో రోజురోజుకు మరింత బజ్ పెరుగుతోంది. సలార్ సినిమా నుంచి విడుదలైన కొన్ని ఫోటోలు, లీకైన మరికొన్ని ఫోటోలు, వీడియోలు సినిమా మీద ఆసక్తిని అమాంతం పెంచేస్తున్నాయి.

దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందనే ప్రచారం జరుగుతున్నా, ఎప్పుడు ఈ సినిమా నుంచి మంచి అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న ప్రచారం మేరకు వచ్చే వారంలో సలార్ నుంచి ఒక మంచి సర్ప్రైజ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఒక మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా సెప్టెంబరు 28న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఇక వచ్చే వారంలో ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసి మళ్ళీ ఆదిపురుష్ విడుదల అనంతరం సలార్ రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. జగపతిబాబు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న సలార్ సినిమాని భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇక ఈ సినిమా కూడా బొగ్గు గనుల నేపథ్యంలోనే సాగబోతోంది అనే ప్రచారం జరుగుతోంది కానీ అందులో నిజా నిజాలు ఎంత వరకు ఉంటాయి అనేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేము. ఇక ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు కూడా ఫిక్స్ చేయని ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











