ప్రభాస్ 20 టైటిల్.. అక్కడ లీక్ చేసేశారు.. మరి తెలుగులో?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు మొన్నటివరకు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇక కరోనా రాకతో ఆ ఆశలను గాలికి వదిలేశారు. అయితే అభిమానుల కోసం కనీసం సినిమా అప్డేట్స్ ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యూవీ ప్రొడక్షన్ ని బ్యాన్ చేయాలంటూ ఆ మధ్య ప్రభాస్ అభిమానులే సోషల్ మీడియాలో ఒక ట్యాగ్ ని వైరల్ చేశారు.
ఆ కోపంతో కొలుకుంటారేమో అనుకుంటే ఎదో కారణంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని వాయిదా వేస్తున్నారు. నెక్స్ట్ ప్రభాస్ 20వ సినిమా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ని గత వారమే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సుశాంత్ సింగ్ మృతి కారణంగా విషాదకరమైన సమయంలో రిలీజ్ చేయకూడదని మళ్ళీ వాయిదా వేశారు.

ఈ విషయంపై బాలీవుడ్ పిఆర్వోలకు క్లారిటీ ఇచ్చిన యూవీ క్తియేషన్స్ టైటిల్ రాధే శ్యామ్ అని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ లో కొంతమంది PROలో రాధే శ్యామ్ టైటిల్ ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అయితే యూవీ క్రియేషన్స్ ఇంతవరకు తెలుగులో టైటిల్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం విశేషం. ఇక నెక్స్ట్ మంత్ లో టైటిల్ మోషన్ పోస్టర్ ని అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











