సీతారామం దర్శకుడికి ప్రభాస్ కండిషన్.. స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఒకదాని తర్వాత ఒక దాన్ని పూర్తి చేసుకుంటూ ప్రభాస్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ప్రభాస్ మరి కొన్ని కథలపై కూడా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక చాలా రోజులుగా సీతారామం దర్శకుడు కూడా ప్రభాస్ చుట్టూ తిరుగుతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ ముందుగానే సీతారామం దర్శకుడు హను రాఘవపూడితో ఒక సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతనికి మంచి కథ సెట్ చేయమని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో మరొక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ సిద్దార్థ్ ఆనంద్ తో అనుకున్న ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు ప్రభాస్ డేట్స్ ను హను రాఘవపూడి కోసం వాడబోతున్నారు.

ఇక ప్రభాస్ కూడా ఆ దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తిని చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుంది అని ప్రభాస్ ముందుగానే దర్శకుడికి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక హను కూడా ప్రభాస్ కు కనెక్ట్ అయ్యే విధంగా మంచి లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బౌండెడ్ స్క్రిప్టు సిద్ధమైన తర్వాత మళ్లీ ప్రభాస్ హను రాఘవపూడి మధ్యలో చర్చలు కొనసాగనున్నాయి. ఇక ఫైనల్ స్క్రిప్ట్ ప్రభాస్ కి నచ్చితే ఈ ప్రాజెక్టును త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కుదిరితే ఈ దసరా అనంతరం సినిమాపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వాలని మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటుంది. అలా జరగాలంటే దర్శకుడు హను, ప్రభాస్ కు నచ్చే విధంగా పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేయాలి. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











