మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాటలోనే ప్రభాస్.. ఈసారి మిస్సయితే ఇక అంతే!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో అగ్రహీరోలు అభిమానులకు సరికొత్త కిక్ ఇస్తున్నారు. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం సినిమాల షూటింగ్స్ పూర్తయినా కూడా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకపోవడంతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అందులో రెబల్ స్టార్ ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా కోపంతోనే ఉన్నారనే చెప్పాలి.

ఎందుకంటే మిగతా హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు శరవేగంగా వచ్చేస్తున్నాయి. కానీ ప్రభాస్ కు సంబంధించిన రాధేశ్యామ్ సినిమా విషయంలో మాత్రం చాలా ఆలస్యం జరుగుతోంది. గతంలోనే అభిమానులు చిత్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్స్ తో దండయాత్ర కూడా చేశారు. ఆ వివాదం ప్రభాస్ వరకు వెళ్ళింది. దీంతో ఇటీవల ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్ సూపర్ స్టార్ అభిమానులకు మంచి కిక్ అయితే ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు ఇంకా 5 నెలల సమయం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు హీరో పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోసం స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఒక్కసారిగా టీజర్ సినిమా పై అంచనాల దోసును అమాంతంగా పెంచేసింది. ఇక సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

 మహేష్ బాబు తర్వాత పవర్ స్టార్

మహేష్ బాబు తర్వాత పవర్ స్టార్

మహేష్ బాబు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సరికొత్తగా ట్రెండ్ సెట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ పుట్టినరోజుకు రెండు వారాల ముందే చిత్ర యూనిట్ సభ్యులు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు.

మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ గా వస్తున్న కొత్త కొత్త సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసం గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు మొత్తానికి మంచి కిక్కయితే లభిస్తోంది. పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు సంబర పడుతున్నారు.

అదే బాటలో ప్రభాస్

అదే బాటలో ప్రభాస్

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని రోజులకు ముందే అభిమానులకు మంచి కిక్కైతే ఇచ్చారు. ఇక అదే బాటలో ప్రభాస్ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా రెబల్ స్టార్ తన అభిమానులకు ఒక నెల ముందు నుంచే ప్రత్యేకంగా సర్ ప్రైజ్ లు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ 23న 42వ వసంతంలోకికి అడుగుపెట్టబోతున్నాడు. ముఖ్యంగా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఈ సారి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

టార్గెట్ సెట్ చేసుకున్న యూవీ క్రియేషన్స్

టార్గెట్ సెట్ చేసుకున్న యూవీ క్రియేషన్స్

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోతో పాటు మరొక ముఖ్యమైన టీజర్ ను కూడా ఈ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కూడా ఈసారి అభిమానులను ఏ మాత్రం నిరుత్సాహపరుచ కూడదని డిసైడ్ అయ్యారు. తప్పకుండా సినిమాకు ఏదో ఒక విధంగా బజ్ క్రియేట్ చేయాలని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరో మూడు సినిమాలు అప్డేట్స్?

మరో మూడు సినిమాలు అప్డేట్స్?

ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ అప్డేట్స్ తో పాటు మరో రెండు ముఖ్యమైన సినిమాలు కు సంబంధించిన సర్ ప్రైజ్ లు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో చేస్తున్న ఆది పురుష్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఈసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వనున్నట్లు టాక్ వస్తోంది.

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాకు సంబంధించిన సరికొత్త స్టిల్స్ దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ అప్డేట్ ద్వారా రెబల్ స్టార్ అభిమానులు ఎంతవరకు సంతృప్తి చెందుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X