twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌పై రూ.1000 కోట్ల భారం.. ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగింది!

    |

    ఇంకో రెండేళ్లయితే ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కరెక్ట్ గా 20ఏళ్లవుతుంది. రెబల్ స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాకు 5కోట్లయినా ఖర్చు చేశారో లేదో కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ సినిమా అంటే ఊహించని నెంబర్లు కనిపిస్తున్నాయి. ఒక విధంగా 15 ఏళ్ళ కెరీర్ ఒక విధంగా కొనసాగితే ఆ తరువాత వచ్చిన సినిమాలతో ఆయన మార్కెట్ మరొక రేంజ్ కి వెళ్లింది.

    Recommended Video

    Adipurush : Prabhas To Star In Om Raut’s 3D Action Drama Adipurush || Oneindia Telugu
    అసలైన పాన్ ఇండియా స్టార్

    అసలైన పాన్ ఇండియా స్టార్

    వర్షం, ఛత్రపతి సినిమాలతో అప్పటి స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ప్రభాస్ ఎప్పుడైతే రాజమౌళి ఫోకస్ పెట్టాడో అతని దశ మారిపోయింది. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా అనే దానికి అసలైన అర్థం చెప్పి అసలైన సూపర్ స్టార్ గా నిలిచాడు. ఒక ప్రాజెక్టు కోసం దాదాపు 5ఏళ్ళు కష్టపడ్డాడు.

    ఆ కష్టం వృధా కాలేదు

    ఆ కష్టం వృధా కాలేదు

    బాహుబలి కోసం ప్రభాస్ పడిన కష్టం ఏ మాత్రం వృధా కాలేదు. ఆ సినిమా విజయాన్ని అంసించడమే కాకుండా ప్రభాస్ భవిష్యత్తుజూ రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇప్పుడు పాన్ ఇండియా హీరో అంటే ప్రభాస్ మాత్రమే గుర్తొస్తారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ కంటే హై రేంజ్ సినిమాలు చేస్తూ తెలుగోడి సత్తా చూపిస్తున్నాడు.

     100కోట్ల బడ్జెట్ సినిమాలకు దూరంగా..

    100కోట్ల బడ్జెట్ సినిమాలకు దూరంగా..

    అయితే బాహుబలి సినిమా సమయంలోనే బిగ్ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండాలని ప్రభాస్ చాలానే ప్రయత్నం చేశాడు. కానీ సాహో సినిమా కోసం 300కోట్లు పెట్టాల్సి వచ్చింది. ఆ సినిమా రిజల్ట్ ని ముందే ఊహించిన ప్రభాస్ వెంటవెంటనే 100కోట్ల కంటే హై రేంజ్ బడ్జెట్ సినిమాలు చేయవద్దని అనుకున్నాడు. సాహో ప్రమోషన్స్ లో కూడా ఈ విషయాన్ని చెప్పాడు.

    ఏదైతే చేయకూడదు అనుకున్నాడో

    ఏదైతే చేయకూడదు అనుకున్నాడో


    కానీ ప్రభాస్ ఏదైతే చేయకూడదు అనుకున్నాడో ఇప్పుడు అదే జరుగుతోంది. వరుసగా హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే వాటి మొత్తం బడ్జెట్ 1000కోట్ల రూపాయలు దాటుతున్నాయి. ప్రభాస్ పై ఇది మరో పెద్ద భారమనే చెప్పాలి.

    ఆ మూడు సినిమాలు

    ఆ మూడు సినిమాలు

    రాధేశ్యామ్ లవ్ స్టొరీ అయినప్పటికీ పీరియడ్ డ్రామా కావడంతో దాని కోసం 200కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. ఇక వైజయంతి మూవీస్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న సైన్ ఫిక్షన్ సినిమాకు కూడా బడ్జెట్ 300కోట్లకు పైగానే ఉంటుందని టాక్. ఇక రీసెంట్ గా ఎనౌన్స్ చేసిన ఆదిపురుష్ సినిమాకు ఏకంగా 500కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. ఈ విధంగా ప్రభాస్ పై పెద్ద భారమే ఉంది. మరి రెబల్ స్టార్ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    The much awaited Prabhas 20th movie First Look has finally been released. UV Creations, which has been making fans a little impatient for years due to delays, got a good kick out of the whole first look. The title of Radheshyam has been fixed for the movie as everyone expected. The First Look title is currently trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X