బాహుబలి తరువాత ఇదే హై బడ్జెట్.. ప్రభాస్ ఒక్కడి మీదే వేల కోట్ల పెట్టుబడి..
బాహుబలి మొదటి పార్ట్ 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది అనగానే అప్పట్లో అందరు ఆశ్చర్యపోయారు. ఇక ఆ సినిమా 500కోట్ల కలెక్షన్స్ తో షాక్ ఇవ్వడంతో బహుబలి 2ని అంతకు మించి అనేలా తెరకెక్కించారు. మొత్తానికి ఇండియన్ సినిమా హిస్టరిలో ప్రభాస్ స్థాయి 1500కోట్లకు పైగా చేరుకోవడంతో బాలీవుడ్ హీరోలకు కూడా దిమ్మ తిరిగింది. పాన్ ఇండియా అనే దానికి అసలైన అర్దాన్ని చెప్పిన ప్రభాస్ పై ఇప్పుడు ఏకంగా 1000కోట్లకు పైగా బిజినెస్ నడుస్తోంది.

వచ్చిన బిజినెస్ ని ఎందుకు వదులుకోవాలి..
నెక్ట్స్ రాధే శ్యామ్ సినిమాతో రాబోతున్న ప్రభాస్ సాహో తరువాత వీలైనంత వరకు మినీ బడ్జెట్ సినిమాలు మాత్రమే చేయాలని అనుకున్నాడు. కానీ వచ్చిన బిజినెస్ ని ఎందుకు వదులుకోవడం అనుకున్నాడో ఏమో గాని ప్రతి సినిమా బడ్జెట్ ని 200కోట్లకు పైగానే పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.. రాధేశ్యామ్ కోసం కూడా అదే తరహలో ఖర్చు చేస్తున్నారు. రాధాకృష్ణ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం అన్ని కోట్లా..
ఇక భవిష్యత్తు సినిమాల బడ్జెట్ లెక్కలు అంతకుమించి అనేలా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం వైజయంతి మూవీస్ నాలుగు వందల కోట్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉంది. ఆ సినిమాలో దీపికా పదుకొనె , అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు అంటేనే అర్ధమవుతోంది. బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో.

బాహుబలి తరువాత అత్యంత భారీ స్థాయిలో
ఒకవైపు కరోనా వలన చాలా వరకు బడ్జెట్ ని తగ్గిస్తుంటే ప్రభాస్ నిర్మాతలు మాత్రం క్వాలిటీ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఆ మాత్రం సందేహించకుండా రిస్క్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇక ఆదిపురుష్ బడ్జెట్ ఏకంగా 400కోట్లకు పైగానే ఉంటుందట. బాహుబలి తరువాత అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న సినిమా ఇదేనంటూ కథనాలు వెలువడుతున్నాయి.
Recommended Video

ప్రభాస్ సినిమా కోసం దర్శకుడు కూడా..
ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాను ఐదుగురు బాలీవుడ్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అందులో దర్శకుడు ఓం రావత్ కూడా భారీగానే పెట్టుబడులు పెడుతున్నాడు. రామాయణ కథ ఆధారంగా తుపొందనున్న ఈ సినిమా పూర్తిగా 3D టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కించి మిగతా భాషల్లో డబ్ చేయనున్నారు. మరి ఆది పురుష్ బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











