Prabhas Upcoming Movies Lineup: బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర.. రూ.5000 కోట్ల టార్గెట్ ?

Prabhas Upcoming Movies Lineup: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్నా స్టార్ట్ హీరోలలో డార్లింగ్ ప్రభాస్ ఒకరు. భారీ బడ్జెట్ సినిమా, స్టార్ దర్శకులతో వరుస ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ లైనప్ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారింది. ఆ అంశం డార్లింగ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కేవలం 12 నెలల వ్యవధిలోనే ప్రభాస్ నటించిన మూడు భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ వేర్వేరు జానర్లకు చెందినవే కావడం విశేషం. పీరియాడిక్ డ్రామా, వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్, మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ వంటి డిఫరెంట్ స్టోరీలతో ఆయన ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లైనప్ చూస్తే ప్రభాస్ కేవలం బాక్సాఫీస్ రికార్డుల కోసమే కాకుండా, ఆయన కథలు ఎంచుకున్న తీరు చూస్తుంటే.. పాన్ ఇండియా రేంజ్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ జాబితా చూస్తే..

Prabhas Upcoming Movies Lineup Fauji Spirit Kalki 2 and Salaar 2 Set for Big Run

ఫౌజీ (Fauji)
ప్రభాస్ లైన్ అప్ లో ముందున్న సినిమా ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1940 కాలం నేపథ్యంలో రూపొందుతోంది. దేశభక్తి, ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, 2026 డిసెంబర్‌లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. హను రాఘవపూడి స్టైల్ ఎమోషనల్ టచ్, ప్రభాస్ స్టార్‌డమ్ కలిస్తే సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్పిరిట్ (Spirit)

ఫౌజీ తర్వాత అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'స్పిరిట్'. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత సందీప్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషన్, సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా 2027 మార్చి 5న విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కల్కి 2 (Kalki 2)

ఇక ఈ లైనప్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్ మూవీ కల్కి 2. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. భారతీయ పురాణాలు, భవిష్యత్ ప్రపంచాన్ని మిళితం చేసిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న సీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి. అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, 2027 డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్.

సలార్ 2 (Salaar 2)
ఇక్కడితో ప్రభాస్ లైనప్ ముగియడం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం కూడా లైనప్‌లో ఉంది. సలార్ పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖాన్సార్ ప్రపంచాన్ని మరింత విస్తృతంగా చూపించనున్న ఈ సినిమా కూడా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి.ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తే, ప్రభాస్ సినిమాల మొత్తం బిజినెస్ విలువ రూ.5,000 కోట్ల మార్క్‌ను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఇలాంటి మార్కెట్, ఇలాంటి లైనప్ ఉన్న హీరోలు చాలా అరుదు.

మొత్తంగా చూస్తే ప్రభాస్ కేవలం స్టార్ హీరోగా కాకుండా, భారీ విజన్ ఉన్న దర్శకులతో పనిచేస్తూ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రెండు సంవత్సరాలు ప్రభాస్ అభిమానులకు పండగలాంటివే. ఇప్పుడు అందరి దృష్టి ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 చిత్రాలపైనే ఉంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

Read more about: kalki 2 spirit prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X