500 కోట్ల ప్రాజెక్టు కోసం రంగంలోకి దిగిన ప్రభాస్.. మరింత బిజీగా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటున్న టాప్ స్టార్ హీరోలలో ప్రభాస్ ఇపుడు టాప్ లో ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అంతకు మించి అనేలా పాన్ ఇండియా మార్కెట్ను పెంచుకుంటూనే ఉన్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ బాహుబలి సినిమా ఒక్కటే 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా అదే తరహాలో సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
అయితే నిర్మాతలు మాత్రం సేఫ్ జోన్ లోనే ఉండడంతో ప్రభాస్ మార్కెట్ కూడా ఏమాత్రం తగ్గలేదు అని అర్థమయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ప్రభాస్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు అని సాహో సినిమా తో మరోసారి రుజువైంది. తర్వాత రాబోయే సినిమాల పై ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ప్రభాస్ ప్రస్తుతం లైన్ లో పెట్టిన నాలుగు సినిమాలలో అన్నిటికంటే ఎక్కువగా ప్రాజెక్టు k గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.

సినిమా కోసం దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ కూడా వివరణ ఇచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని అర్థమవుతోంది. సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతున్న సమయంలోనే ఇటీవల ప్రభాస్ చిత్ర యూనిట్ తో కలిశాడు.
ఇన్ని రోజులు రోజులు దర్శకుడితో చర్చలు జరుపుతున్న ప్రభాస్ మొత్తానికి ఈ రోజు తన క్యారెక్టర్ కు సంబంధించిన మేకప్ తో చిత్ర యూనిట్ సభ్యులతో కలిశాడు. ప్రభాస్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక అతనికి గురువుగా అమితాబ్ బచ్చన్ కూడా కనిపించబోతున్నాడని సమాచారం. ఇక సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుండగా మరొక ముఖ్యమైన పాత్ర కోసం సౌత్ హీరోయిన్ ను కూడా సెలక్ట్ అయినట్లు సమాచారం. ఇక దర్శకుడు ఈ సినిమాను 2024లో తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











