Adipurush: ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో వేడుక.. శ్రీవారి సన్నిధిలో ప్రభాస్.. 3 గంటల దాకా అక్కడే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న అభిమానుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణంరాజు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన నటనతో అభిమానులకు భారీగా సంపాదించుకున్నాడు. ఇక బాహుబలితో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా సరైన హిట్ లేని ప్రభాస్ కు ఆయన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో ఇవాళ జరగనుండగా శ్రీవారి సేవలో ప్రభాస్ పాల్గొన్నాడు.
జూన్ 16న రిలీజ్:గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా అలరించేందుకు వస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళంలో రిలీజ్ చేయనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకులలో విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేస్తోంది.

ఏర్పాట్లు పూర్తి:ఆదిపురుష్ పై ఉన్న అంచనాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల ట్రైలర్, సాంగ్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ ఆధ్వర్యంలో:తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. ఈ వేడుకకు లక్షలాది మంది అభిమానులు రానుండగా.. ముఖ్య అతిథిగా చిన జీయర్ స్వామి హాజరు కానున్నారు. అందుకోసం 50 అడుగులు హాలోగ్రామ్ ఇమేజ్ ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే వేడుక సందర్భంగా తిరుపతికి వచ్చిన స్టార్ హీరో ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్నారు.

సాంప్రదాయ దుస్తుల్లో:జూన్ 6న అంటే మంగళవారం రోజున వేకువ జామున సాంప్రాదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం మొదటి ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అలాగే ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

3 గంటల వరకు:మంగళవారం మధ్యాహ్నాం 3 గంటల వరకు ప్రభాస్ తిరుమలలోనే బస చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతారు. ఇత తిరుమలలో ప్రభాస్ ఉన్నాడని తెలుసుకున్న అభిమానులు భారీగా పోటెత్తారు. ప్రభాస్ తో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











