400కోట్లు కాదు, అంతకు మించి.. ప్రభాస్ మార్కెట్ మామూలుగా లేదు!
ప్రభాస్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల లిస్ట్ రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి. బహుబలి కంటే అంతకు మించి అనే రేంజ్ ల్ బడ్జెట్ లెక్కలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఎవరు ఎంత పెట్టినా కూడా మినిమమ్ వసూళ్లు రావడం కాయమని తెలుస్తోంది. ముందుగా అది పురుష్ సినిమాకు 500కోట్లని అంటున్నారు. ఓం రావత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా బడ్జెట్ బాలీవుడ్ లోనే నెవర్ బిఫోర్ అనేలా ఉంది.
ఇక ప్రతిష్టాత్మక వైజయంతి ప్రొడక్షన్ లో కూడా ప్రభాస్ ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా బడ్జెట్ ఇంకాస్త పేరిగినట్లు తెలుస్తోంది. మొదట 400కోట్లు అనుకున్నప్పటికి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ టార్గెట్ సెట్ చేసుకున్నారట. దాదాపు 600కోట్ల వరకు ఖర్చు అయ్యేలా ఉందని సమాచారం.

ఇంతవరకు ఆదిపురుష్ సినిమా ఒక్కటే బిగ్ బడ్జెట్ అనుకుంటే ఇది అంతకంటే హై రేంజ్ లో ఉంది. చూస్తుంటే ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకినట్లు అర్థమవుతోంది. నిజంగా వైజయంతి ప్రొడక్షన్స్ భారీ రిస్క్ చేస్తోందనే చెప్పాలి. సినిమాకు యవారేజ్ టాక్ వస్తే సరిపోదు. మినిమమ్ హిట్టు అంటేనే లాభల్లోకి రావచ్చు. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా దీపిక పదుకొనె కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











