twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్, హిందీలో మాట్లాడండి... ప్రభాస్ రెస్పాన్స్ చూసి బాలీవుడ్ మీడియా ఆశ్చర్యం!

    |

    రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన బాహుబలి ఫ్రాంచైజీ అద్భుతమైన విజయం తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీగా అభిమానులు ఏర్పడ్డారు.

    'సాహో' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొందరు మీడియా వారు హిందీ ఫ్యాన్స్ కోసం ఏదైనా హిందీలో మాట్లాడాలని కోరారు. అయితే ఈ ప్రశ్నను అవాయిడ్ చేస్తూ వచ్చిన ప్రభాస్ పదే పదే రిపోర్టర్లు అడుగుతుండటంతో 'జై హింద్' అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రభాస్ ఇలా అనడాన్ని హిందీ మీడియా ఫన్నీగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తోంది.

    హిందీ మాట్లాడటం కష్టమని చెప్పిన ప్రభాస్

    హిందీ మాట్లాడటం కష్టమని చెప్పిన ప్రభాస్

    సాహో మూవీ ఆగస్టు 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. తమిళం, తెలుగు, హిందీలో ఈచిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘నేను హిందీ రాయగలను, చదవగలను... కానీ మాట్లాడటం కష్టం. కానీ అవసరమైనపుడు మేనేజ్ చేయగలను, ఈ సినిమా డబ్బింగ్ విషయంలో అలాగే చేశాను' అని ప్రభాస్ తెలిపారు.

    నార్త్ ఇండియాలోనే 4500 స్క్రీన్లు

    నార్త్ ఇండియాలోనే 4500 స్క్రీన్లు

    ‘సాహో' డిస్ట్రిబ్యూటర్ అనిల్ తదాని ట్రైలర్ లాంచ్ ఈవెంటులో మాట్లాడుతూ ఈచిత్రాన్ని దేశ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ‘కేవలం నార్త్ ఇండియాలోనే 4500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. సౌతిండియా కూడా భారీగా రిలీజ్ అవుతుంది' అన్నారు.

    ఖాన్ త్రయం గురించి అడిగితే... ప్రభాస్ ఇలా

    ఖాన్ త్రయం గురించి అడిగితే... ప్రభాస్ ఇలా

    బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్‌లకు మీరు పోటీ ఇవ్వగలరా? అని మీడియా వారు ప్రశ్నించగా... ప్రభాస్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ‘‘థాంక్సూ మామ్..నేను వెళ్లొచ్చా?' అంటూ అక్కడి నుంచి తప్పుకున్నారు.

    సాహోలో బాలీవుడ్ స్టార్స్

    సాహోలో బాలీవుడ్ స్టార్స్

    సాహో మూవీ కోసం చాలా మంది బాలీవుడ్ స్టార్స్‌ను ఎంపిక చేశారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అన్ని భాషల నుంచి నటీనులను ఎంపిక చేశారు.

    అండర్ కవర్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్

    అండర్ కవర్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్

    సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ అండర్ కవర్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ముంబైలో జరిగిన ఓ భారీ దోపిడీ గురించి, దాని వెనక ఎవరు ఉన్నారు అనే విషయం ఇన్వెస్టిగేట్ చేస్తూ సినిమా సాగుతుంది. ఇందులో ప్రభాస్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృత నాయర్‌తో కలిసి పని చేస్తాడు. పవర్ ఫుల్ గ్యాంగస్టర్లు ఉండే వాజి సిటీలో కథ సాగుతుందని తెలుస్తోంది

    English summary
    Bollywood media representatives asked Prabhas to speak in Hindi. The young Rebel star replied that am not able to speak Hindi properly. They asked the same question over and over again, Prabhas replied that 'Jai Hind'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X