సడెన్‌గా ముంబైలో ప్రత్యక్షమైన ప్రభాస్: దాని కోసం ముందే మొదలు పెట్టేశాడట
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే 'బాహుబలి' చిత్రంతో అతడు యూనివర్శల్ స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి స్టైల్‌ను, రేంజ్‌ను మార్చుకున్న ఈ హీరో.. పాన్ ఇండియా చిత్రాలనే లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటించాడు. ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఇక, ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఇప్పటికే రెండు భారీ చిత్రాలను పట్టాలెక్కించేశాడు ఈ పాన్ ఇండియా హీరో.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రామాయణం నాటి కథతో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఆ మధ్య నిలిచిపోయిన ఈ సినిమా షూట్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ తాజాగా లీకైంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' మూవీ కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ముంబై చేరుకున్నాడట. అక్కడ నిర్విరామంగా జరుగుతోన్న ఈ మూవీ షూటింగ్‌లో అతడు ఈ రెండు మూడు రోజుల నుంచి పాల్గొంటాడని తెలుస్తోంది. అక్కడి నుంచి దాదాపుగా 20 రోజుల పాటు ఈ చిత్రీకరణలో భాగం కాబోతున్నాడని ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి ప్రభాస్ సెప్టెంబర్ తర్వాత ఈ మూవీ షూట్‌లో పాల్గొనాల్సి ఉందట. కానీ, ముందే అతడు ముంబై వెళ్లిపోయాడు. దీంతో ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి కంటే ముందే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది.
'ఆదిపురుష్' సినిమాపై ఆది నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా దీనిపై తెలుగు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనికి కారణం ఇది బాలీవుడ్ చిత్రం కావడమే. మన హీరో అక్కడ సత్తా చాటాలని అందరూ కోరకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే యంగ్ రెబెల్ స్టార్ తన రేంజ్‌ను చూపిస్తున్నాడు. ఇక, ఈ సినిమా నుంచి త్వరలోనే ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్ రాబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, అలాంటిదేదీ బయటకు రాలేదు. దీనిపై సినీ ప్రియులంతా ఎంతో నిరాశగా ఉన్నారు.

వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ రాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో పాగా వేయాలని యంగ్ రెబెల్ స్టార్ ఆశిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











