twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas: ఆ దెబ్బ ఇంకా మానలేదా?.. శాస్త్ర చికిత్సకి సిద్దమైన డార్లింగ్.. రాబోయే సినిమాలపై ప్రభావం?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కాలంలో వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనివిధంగా డార్లింగ్ భిన్నమైన ప్రాజెక్టులను ఓకే చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. రానున్న రెండు మూడేళ్లలో ప్రభాస్ అభిమానులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించాలని ఫిక్సయ్యాడు. అయితే ప్రభాస్ ఒక పాత గాయం కారణంగా శస్త్రచికిత్స చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు తప్పనిసరిగా అతనికి బెడ్ రెస్ట్ అవసరం కావడంతో తదుపరి సినిమాల పై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

    కష్టపడినా.. సక్సెస్ రాలేదు

    కష్టపడినా.. సక్సెస్ రాలేదు

    ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ గా మారిపోయిన విషయం తెలిసిందే. సాహో రాధే శ్యామ్ సినిమాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ ఆ సినిమాలో అనుకోని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చాయి. అయితే ఆ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం సంతృప్తిని ఇవ్వలేకపోయాయి.

    ఆ షూటింగ్ లో గాయాలు

    ఆ షూటింగ్ లో గాయాలు

    ఇక సాహో సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఫుల్ యాక్షన్ సన్నివేశాల కోసం డూప్ లేకుండా నటించాల్సి వచ్చింది. అయితే కొన్ని కష్టతరమైన సన్నివేశాల్లో ప్రభాస్ గాయాలను కూడా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా మోకాలికి బలమైన గాయం కావడంతో ప్రభాస్ పలు సందర్భాల్లో షూటింగ్లకు సడన్ గా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

    నొప్పి ఎక్కువవ్వడంతో..

    నొప్పి ఎక్కువవ్వడంతో..

    అసలైతే సాహో షూటింగ్ తర్వాత ప్రభాస్ మోకాలికి సర్జరీ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్లో పెట్టడం తో అసలు తీరిక కూడా దొరకలేదు. ఒకవైపు రెగ్యులర్ షూటింగ్ లో మరొకవైపు రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్స్ తో ప్రభాస్ చాలా బిజీ కావాల్సి వచ్చింది. ఇక ఇటీవల మోకాలి నొప్పి తీవ్రం కావడంతో వైద్యులు వెంటనే సర్జరీ చేసుకోవాల్సిందిగా సీరియస్ గా చెప్పినట్లు తెలుస్తోంది.

    బెడ్ రెస్ట్ తప్పనిసరి..

    బెడ్ రెస్ట్ తప్పనిసరి..

    ఇటీవల రాధే శ్యామ్ సినిమా విడుదలకు ముందే ఇటలీ వెళ్లిపోయిన ప్రభాస్ అక్కడే సర్జరీ కి రెడీ అవుతున్నట్లు గా కథనాలు వెలువడ్డాయి. ఇక ప్రభాస్ మరికొన్ని రోజుల్లో సర్జరీ చేసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. ఒకవేళ ఆ చికిత్స జరిగితే ప్రభాస్ దాదాపు రెండు నుంచి మూడు నెలల వరకు తప్పనిసరిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.

    ఆ సినిమాలపై ప్రభావం

    ఆ సినిమాలపై ప్రభావం

    ప్రస్తుతం ప్రభాస్ బ్రేక్ తీసుకుంటే మాత్రం చాలా షూటింగ్ పనులు పెండింగ్ లో పడతాయి. ముఖ్యంగా సలార్ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ఫినిష్ చేయాలి అని దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి ప్రణాళికలతో సిద్ధమయ్యాడు. అంతే కాకుండా మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ K షెడ్యూల్ ప్లాన్ కూడా ఎప్పుడో రెడీ చేసుకున్నారు.

    మరింత ఆలస్యం?

    మరింత ఆలస్యం?

    ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఇప్పట్లో పూర్తి చేయకపోతే నిర్మాతలు కొంత ఇబ్బంది పడక తప్పదు. అంతే కాకుండా రిలీజ్ కూడా మరికొంత ఆలస్యం కావచ్చు. ఇక శుటీంగ్స్ కోసం మళ్లీ మిగతా ఆర్టిస్టుల డేట్లు దొరకాలంటే కూడా అంత ఈజీ కాదు. మరి ప్రభాస్ ఎంత త్వరగా కోలుకుంటాడు చూడాలి. అలాగే ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చే ఏడాది స్పిరిట్ అనే మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

    English summary
    Prabhas will be undergoing knee surgery soon and upcoming movies plans changes..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X