మీరు మనిషేనా? బాలకృష్ణకు హీరోయిన్ సూటి ప్రశ్న.. షూటింగ్ లో ఆ అనుభవంతోనే అలా?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది. కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె ఐఏఎస్ అధికారిణిగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె బాలయ్యతో తన వర్క్ ఎక్స్పీరియన్స్ ను పంచుకుంది. ఆ సమయంలోనే ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అలా ఎంట్రీ ఇచ్చి

అలా ఎంట్రీ ఇచ్చి

మోడలింగ్ రంగంలో సత్తా చాటిన ప్రగ్యా జైస్వాల్.. 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమా తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలు ఏవీ ఆమెకు కలిసి రాలేదు దీంతో చాలా రోజులకు 'కంచె'తో రీలాంచ్ అయింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆమెకు మంచి పేరు దక్కింది.

సరైన సినిమాలు ఎంచుకొక పోవడంతో

సరైన సినిమాలు ఎంచుకొక పోవడంతో

కంచె' చిత్రంతో ప్రగ్యా జైస్వాల్ ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను గెలుచుకున్న కారణంగా ఆమెకు అనేక ఆఫర్లు వెల్లు వెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ భామ నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా చాలా చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఈ కారణంగానే సినిమాల వేగం తగ్గించేసి బాలీవుడ్‌ లోకి ఎంటర్ అయి అక్కడ కూడా లక్ పరీక్షించుకుంది .

 అఖండ సినిమాతో

అఖండ సినిమాతో

ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండడం వల్లే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ భామ బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆయన మనిషేనా?

ఆయన మనిషేనా?

"బాలకృష్ణ గారు సమయ పాలన పాటించే మరియు ముహూర్తం మొదలైనవాటిని నమ్మే హీరో అని ఆమె అన్నారు. మొదటి రోజు, మేము కారులో కూర్చున్నాము, ఉదయం 8.02 గంటలకు షూట్ ప్రారంభించాల్సి వచ్చింది. మేము 8 AMకి కారులో ఎక్కాము మరియు స్టార్ట్ చేయడానికి ఆ రెండు నిమిషాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము. అవి నా జీవితంలో సుదీర్ఘంగా గడిచిన 2 నిమిషాలు," అనిఆమె చెప్పింది.

Recommended Video

Kurushatram Trailer Launch Event | Darshan | Arjun Sarja | Naganna | Sonu Sood || Filmibeat Telugu
ఆయన గురించి మంచి విషయం చెప్పాలంటే

ఆయన గురించి మంచి విషయం చెప్పాలంటే


"బాలకృష్ణ గురించి చెప్పాల్సిన మంచి విషయం ఏమిటంటే, ఆయన సెట్‌లోకి ప్రవేశించిన తర్వాత అంతా నిశ్శబ్దంగా మారుతుంది. గందరగోళం ఉండదు. కాబట్టి, ఆయన సెట్‌లో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని ఆమె అన్నారు. ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డాడన్న ప్రఘ్యా ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు లేచి, ఉదయం 5-6 గంటలకు సెట్‌లో ఉండేవారు, "అని ఆమె వెల్లడించింది.

"ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి అందుకే వాటి కోసం చాలా సేపు షూట్ చేసేవారు. అవన్నీ నిజంగా కఠినమైనవి. దీంతో ఆయన రోజంతా షూట్ చేసేవాడు. నేను ఆయనని మీరు మనుషులా సార్? మీరు ఇలా ఎలా చేయగలరు? అని అడిగేదానిని అని కానీ ఆయన నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ ఉండేవాడనీ అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం మరపురాని విషయం' అని ప్రగ్యా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X