బాలకృష్ణతో ప్రేమలో పడిపోయిన ఐఏఎస్ ఆఫీసర్‌: ఆ సినిమాను గుర్తు చేసేలా లవ్ ట్రాక్

కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం గతంలో తనకు 'సింహా', 'లెజెండ్' వంటి భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడాయన. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచే భారీ బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇలాంటి సమయంలో దీని నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె పోషించేది ఐఏఎస్ పాత్ర అని తెలిసింది. ఓ జిల్లాకు కలెక్టర్‌గా పని చేసే సమయంలో.. ఆ ఊరి పెద్ద అయిన బాలకృష్ణతో ప్రేమలో పడుతుందట ఈ భామ. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుందని, అది సినిమాకే హైలైట్‌గా నిలిచేలా డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. గతంలో బోయపాటి తీసిన 'సరైనోడు'లో హీరో ఎమ్మెల్యేతో ప్రేమలో పడతాడు. ఇందులోనూ అదే తరహా ట్రాక్‌ను చూపిస్తారని టాక్.

Pragya Jaiswal play IAS Officer Role in Nandamuri Balakrishna Movie

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పూర్ణ అలియాస్ సామ్నా కాశీం మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. వీళ్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా కీలక పాత్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో బాలయ్య పవర్‌ఫుల్ రైతు గానూ, అఘోరా గానూ నటిస్తున్నాడు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X