twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం క్యాండిడేట్ పవన్..ప్రకటించడానికి వాళ్ళెవరు...ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖలు!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. హిందీలో సూపర్ హిట్ గా నిలిచినా పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మించారు .

    ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు... కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, అనన్య నాగల్ల, అంజలి, నివేదా థామస్ లు నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పవన్ కు ప్రత్యర్థిగా లాయర్ పాత్రలో నటించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిత్వం గురించి ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఇంకా తగ్గని క్రేజ్

    ఇంకా తగ్గని క్రేజ్

    ముందు నుంచి చాలా పాజిటివ్ బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల విషయంలో సరైన క్లారిటీ లేక పోవడంతో ఈ సినిమా నిర్మాతలు ఇప్పటికీ కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించ లేకపోతున్నారు.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఇది ఒక రకమైన ఫీస్ట్ అనే చెప్పాలి.

    అయితే ఈ సినిమా రిలీజ్ అయి చాలా రోజులు దాటుతున్నా ఈ సినిమాలో నటించిన వారిని ఇంకా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాయి.. అలాంటి ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిత్వం గురించి ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    సీఎం అభ్యర్థిగా పవన్

    సీఎం అభ్యర్థిగా పవన్

    నిజానికి తిరుపతి ఉప ఎన్నికలకు కొద్ది రోజులకు ముందు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను బీజేపీ - జనసేన కూటమి సీపీఎం అభ్యర్థి అంటూ ప్రకటించారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు వచ్చి తన సిద్ధాంతాన్ని వివరించాలని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఎవరో ఎవరిని సీఎం చేయడం అనేది సరికాదని అసలు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదు అని ఆయన పేర్కొన్నారు.

    సీఎంను ఎన్నుకునేది ఎమ్మెల్యేలు

    సీఎంను ఎన్నుకునేది ఎమ్మెల్యేలు

    ఎందుకంటే ఒక సీఎంను ఎన్నుకునేది ఎమ్మెల్యేలు అని ఆ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటారు అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.. కేవలం తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇలా ప్రకటించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రాజకీయ పరంగా ప్రకాష్ రాజ్ బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనే వాదన వినిపిస్తోంది. దేశమంతా ఒకే ఫార్ములా తెస్తామని బిజెపి చేబుతుందన్న ఆయన అది సరి కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. అందుకే కేసీఆర్, మమతా బెనర్జీ ఫెడరల్ సిస్టం గురించి మాట్లాడుతున్నారని, దేశమంతా ఒకే ఫార్ములా కుదరదని, భిన్న సంస్కృతులు భాషలు భిన్నమైన అవసరాలు ఉంటాయని పేర్కొన్నారు.

    Recommended Video

    Guna 369 Movie Team Success Tour In Tirupati
    చాలా గౌరవించారట

    చాలా గౌరవించారట

    ఇక ప్రకాష్ రాజ్ కూడా వకీల్ సాబ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. పవన్ వాదిస్తున్న కేసుకు ప్రత్యర్థి లాయర్ గా ఆయన నటించారు. లాయర్ నందా పాత్రలో ప్రకాష్ రాజ్ మంచి మార్కులు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆయనకు ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ సినిమా రిలీజ్ అయిన సమయంలో మాత్రం ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా వ్యాఖ్యానించారు. రాజకీయాలలో తమకు పెద్దగా పొసగక పోయినా సినిమా షూటింగ్ సమయంలో పవన్ తనను చాలా గౌరవించారని అని చెప్పుకొచ్చారు.

    English summary
    Befor Tirupati by-election, several BJP state leaders had announced that Pawan Kalyan will be the BJP-Janasena alliance’s CM candidate in the 2024 general elections. Recently Prakash Raj, who played Pawan Kalyan’s nemesis in Vakeel Saab, has made some intresting comments in this regard.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X