దిల్ రాజు కోసం... ప్రకాష్ రాజ్ అంత డబ్బు వదులుకున్నాడా?

By Bojja Kumar

Recommended Video

Prakash Raj Reduces His Pay For Dil Raj

సౌతిండియాలో టాప్ యాక్టర్లలో ప్రకాష్ రాజ్ ఒకరు. జాతీయ అవార్డు విన్నర్ అయిన ఈ విలక్షణ నటుడు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. ఆయన రోజుకు సినిమాను బట్టి రూ. 10 లక్షల నుండి రూ.5 లక్షల వరకు చార్జ్ చేస్తారనే టాక్ ఉంది. అలాంటి ప్రకాశ్ రాజ్ .. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కోసం రోజుకి 3 లక్షలు మాత్రమే తీసుకున్నారనే ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. రెమ్యూనరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండే ఈ స్టార్ యాక్టర్... ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.

దిల్ రాజు కోసమే..

దిల్ రాజు కోసమే..

స్నేహం కోసం ప్రకాష్ రాజ్ ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అనే పేరుంది. నిర్మాత దిల్ రాజు, ప్రకాష్ రాజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. తన స్నేహితుడి సినిమా కావడం వల్లనే ప్రకాష్ రాజ్ కావాలని తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

కీలక పాత్రలో ప్రకాష్ రాజ్

కీలక పాత్రలో ప్రకాష్ రాజ్

ఈ సినిమాలో హీరోయిన్‌కి తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే సీన్లు అద్భుతంగా ఉండబోతున్నాయట. ప్రకాష్ రాజ్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా ఇది ఉండబోతోందని, తనకు పాత్ర ఎంతో నచ్చడం, దిల్ రాజు బేనర్ నుండి వస్తున్న సినిమా కావడంతో రెమ్యూనరేషన్ తగ్గించుకుని మరీ చేశాడని టాక్.

 దిల్ రాజు గురించి ప్రకాష్ రాజ్ గొప్పగా

దిల్ రాజు గురించి ప్రకాష్ రాజ్ గొప్పగా

శ్రీ వెంకటేశ్వర సంస్థకు నాకు మంచి అనుబంధం ఉంది. దిల్ రాజు ప్రతిసారి నాకు ఒక కథ చెప్తాడు. ఈ మాట నేను ప్రతి వేడుకలో చెప్తాను. విలువలతో కూడిన మంచి సినిమాలు అందించే సంస్థ ఇది. మంచి విషయాన్ని, మంచి వాతావరణాన్ని ప్రేక్షకులకు అందిస్తారు దిల్ రాజు, అందుకే ఆ సంస్థ అంటే ఇష్టం. ఈ సినిమా నాకు మంచి అనుభూతి. ఎందుకంటే నేను బ్రతుకుని చూశా. పెళ్లిని ఒక వేడుకగా మాత్రమే చూస్తున్నాం. అయితే ఈ వీటన్నింటి వెనుక మనం మరిచిపోయిన విలువల్ని వెలికితీసే ప్రయత్నమే ‘శ్రీనివాస కళ్యాణం'... అని ఇటీవల ఆడియో వేడుకలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

శ్రీనివాస కళ్యాణంపై భారీ అంచనాలు

శ్రీనివాస కళ్యాణంపై భారీ అంచనాలు

`శ‌త‌మానం భ‌వ‌తి` చిత్రాన్ని రూపొందించిన‌ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పెళ్లి అనే అంశాన్ని ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ చూపని విధంగా ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆగస్టు 9న విడుదల కాబోతున్న ఈచిత్రంపై భారీ అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X