ఎన్టీఆర్, మహేశ్ అయిపోయారు.. ప్రభాస్‌కు స్టోరీ చెప్పిన స్టార్ డైరెక్టర్.. ఓకే చేశాడా.!

By Manoj Kumar P

'కేజీఎఫ్' అనే సినిమాతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయ్యాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఈ సినిమాలో యశ్‌ను ఎంతో ఎలివేట్ చేసి చూపించిన తీరుకు ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. దీనికితోడు ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రావడంతో దేశ వ్యాప్తంగా ప్రశాంత్ పేరు మారుమ్రోగిపోయింది. దీంతో ఈ సినిమా తర్వాత ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఎంతో మంది బడా నిర్మాతలు ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. కానీ, ఆయన మాత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన టాలీవుడ్‌లోని ఓ బడా హీరోకు కథను వినిపించారట. ఇంతకీ ఎవరా హీరో.? మరి సినిమాను ఓకే చేసేశాడా.? పూర్తి వివరాల్లోకి వెళితే...

నందమూరి హీరోతోనే అన్నారు

నందమూరి హీరోతోనే అన్నారు

ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించిన తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాదు, వీళ్లిద్దరి మధ్య కథా పరమైన చర్చలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. ప్రశాంత్ చెప్పిన కథ తారక్‌కు బాగా నచ్చేసిందని అన్నారు. అలాగే, ఈ సినిమాలో జూనియర్.. డ్యాన్సర్‌గా కనిపించబోతున్నాడని కూడా గుసగుసలు వినిపించాయి.

క్లారిటీ ఇచ్చిన నిర్మాత

క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తారక్- ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాత నవీన్ యెర్నేని స్పందించారు. ‘‘మేము ప్రశాంత్, తారక్‌తో చర్చలు జరుపుతున్న విషయం నిజమే. ప్రశాంత్ వచ్చి తారక్‌కు స్టోరీ చెప్పి, అది ఆయనకు నచ్చితే కచ్చితంగా ముందుకు వెళ్తాం. అన్నీ ఓకే అయితే బహుశా 2020 చివర్లో మా సినిమా ప్రారంభం అవుతుంది. అప్పటికి ఎన్టీఆర్ ‘RRR', ప్రశాంత్ ‘కేజీఎఫ్.. చాప్టర్ 2' పూర్తవుతాయి'' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు

ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు

రెండు రోజుల క్రితం ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఓ వార్త బయటకు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా ఉంటుందని అనుకున్నప్పటికీ ఇది వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. దీనికి కారణం ప్రశాంత్ ‘కేజీఎఫ్ 2' షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతుండడమేనని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ తర్వాతి సినిమా ప్రశాంత్‌ డైరెక్ట్ చేయడం లేదని టాక్.

ఆ స్టార్ హీరో అతడే

ఆ స్టార్ హీరో అతడే

ప్రశాంత్ నీల్ ఇటీవలే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు ఓ కథను చెప్పాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కించేందుకు ప్రశాంత్ సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ కథ కూడా ప్రభాస్‌కు బాగా నచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో హీరో ఎలివేషన్ హైలైట్‌గా ఉండేలా ప్రశాంత్ స్క్రిప్టును నేరేట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రభాస్ దీన్ని ఓకే చేశాడని టాక్.

Recommended Video

#Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
ఇద్దరూ ఫుల్ బిజీనే

ఇద్దరూ ఫుల్ బిజీనే

ఇటు ప్రభాస్, అటు ప్రశాంత్ ప్రస్తుతానికి ఫుల్ బిజీగా ఉన్నారు. ‘సాహో' తర్వాత ప్రభాస్ ‘జాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘జిల్' ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 1980ల నాటి ప్రేమకథగా రూపొందనుందట. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే, ప్రశాంత్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవడానికి దాదాపు ఏడాది పట్టొచ్చని అంటున్నారు. వీటి తర్వాత ఈ ఇద్దరి సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X